AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ కఠిన ఆంక్షలు, ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లకు 5 ఏళ్ళ జైలు శిక్ష, జరిమానా, మానవ హక్కుల సంఘాల నిరసన

ఇండియాలో కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు  తీసుకుంది. ఇండియాలో ఉంటున్న ఆస్ట్రేలియన్లు 14 రోజుల్లోగా తాము ఇండియా నుంచి స్వదేశానికి 

మరీ కఠిన ఆంక్షలు, ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లకు 5 ఏళ్ళ జైలు శిక్ష, జరిమానా, మానవ హక్కుల సంఘాల నిరసన
Australians Arriving From India Could Face 5 Years Jail
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 01, 2021 | 2:00 PM

Share

ఇండియాలో కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు  తీసుకుంది. ఇండియాలో ఉంటున్న ఆస్ట్రేలియన్లు 14 రోజుల్లోగా తాము ఇండియా నుంచి స్వదేశానికి  వెళ్లాలని భావిస్తున్న పక్షంలో వారిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. దీన్ని ఖాతరు చేయకుండా వారు ఆస్ట్రేలియాలోకి  ప్రవేశిస్తే 5 ఏళ్ళ జైలు శిక్ష, జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3 నుంచి ఈ ఆంక్షలు  అమలులోకి రానున్నాయి. శుక్రవారం రాత్రి పొద్దు పోయిన  తరువాత ఈ తాత్కాలిక నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హర్ట్ తెలిపారు. ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి రాగోరుతున్న ఆస్ట్రేలియన్లపై ఇలా క్రిమినల్ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ హాట్ స్పాట్ గా మారిన విషయం గమనార్హం. కాగా తాజా ఆంక్షలపై తాము ఈ నెల 15 న పునరాలోచన చేస్తామని గ్రెగ్ హర్ట్ తెలిపారు. ఇండియాలో కేసులు తగ్గిన పక్షంలో   వీటిని పునఃపరిశీలన చేస్తామన్నారు. కాగా – ఆంక్షలు చాలా దారుణంగా ఉన్నాయని ఆస్ట్రేలియాలో ఉంటున్న నీలా జానకీరామన్  అనే సర్జన్ ఆరోపించారు. తమ కుటుంబం ఇండియాలో ఉంటున్నదని ఆయన  చెప్పారు. ఇండియన్ ఆస్ట్రేలియన్లు దీన్ని రేసిస్ట్ పాలసీ (జాతి వివక్ష) గా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిని,తమను వేరుగా చూస్తున్నారని ఆయన విమర్శించారు.  అమెరికా, యూకే,  యూరప్ దేశాల్లో కూడా కోవిడ్ రోగులు లేరా అని ప్రశ్నించారు. ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లను ఇది క్రిమినలైజ్ చేయడమే అని నీలాజానకిరామన్ వ్యాఖ్యానించారు.

అటు- మానవ హక్కుల బృందాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు  పట్టాయి.ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునే బదులు క్వారంటైన్ మెరుగుదలపై దృష్టి పెట్టాల్సి ఉండిందని ఆస్ట్రేలియా రైట్స్ వాచ్ డైరెక్టర్ ఎలైన్ పియర్సన్ అన్నారు.