WHO Warning: భారత్‌లో ఉన్న పరిస్థితులు ఎక్కడైనా జరగవచ్చు.. ఐరోపా దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో
WHO Warning: ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి భారత్‌తో పాటు ప్రపంచ..
WHO Warning: ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి భారత్‌తో పాటు ప్రపంచ దేశాల పరిశోధకులు సైతం తీవ్ర స్థాయిలో శ్రమించి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక భారత్‌లో అయితే తీవ్ర స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ప్రతిరోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా దేశాలకు ఓ హెచ్చరిక చేసింది.
భారతదేశంలో పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తవచ్చని పేర్కొంది. కరోనా నియంత్రణ చర్యలను ఏమాత్రం తగ్గించినా భారత్‌లో తలెత్తుతున్న పరిస్థితులు ఇతర దేశాల్లోకి తలెత్తే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. అయితే ఇటువంటి తప్పిదం ఏ దేశమూ చేయవద్దని ఐరోపా విభాగం అధిపతి హాన్స్ క్లూగె సూచించారు. ప్రస్తుతం కూడా ఐరోపాలో కరోనా వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోందని, ఇలాంటి సమయంలో కరోనా నియంత్రణ చర్యలను ఏమాత్రం సడలించినా ప్రమాదమని హెచ్చరించారు.
కాగా, తాజాగా భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటేసింది. ఇక కరోనాతో 3,523 మంది మరణించారు. ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969 (1.91 కోట్లు)కు చేరగా, మరణాల సంఖ్య 2,11,853కు చేరింది.