AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Journey: గాల్లో తేలుతూ.. ట్రాఫిక్ మధ్య నుంచి..వేగంగా దూసుకుపోతూ డ్రోన్ పై ప్రయాణం..Viral Video

 గాల్లో ఎగురుతూ రయ్ రయ్ మని సిటీ మొత్తం తిరిగేయాలని ఎవరికి ఉండదు? ఇప్పుడు పిల్లలు అయితే, హాలీవుడ్ సినిమాలు చూసి అలా గాలిలో ఎగిరిపోతూ ఊరంతా రౌండులు కొట్టేయాలని అనుకుంటారు.

Drone Journey: గాల్లో తేలుతూ.. ట్రాఫిక్ మధ్య నుంచి..వేగంగా దూసుకుపోతూ డ్రోన్ పై ప్రయాణం..Viral Video
Drone Journey
KVD Varma
|

Updated on: May 01, 2021 | 1:21 PM

Share

Drone Journey: గాల్లో ఎగురుతూ రయ్ రయ్ మని సిటీ మొత్తం తిరిగేయాలని ఎవరికి ఉండదు? ఇప్పుడు పిల్లలు అయితే, హాలీవుడ్ సినిమాలు చూసి అలా గాలిలో ఎగిరిపోతూ ఊరంతా రౌండులు కొట్టేయాలని అనుకుంటారు. కానీ, అది సాధ్యం అయ్యే పని కాదుకదా. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి గాలిలో పోవాలంటే.. విమానమో హెలికాప్టరో ఎక్కి పోవచ్చు. కానీ, సిటీలో ఉన్నపళంగా ఎగురుతూ పోవాలంటే.. ప్రస్తుతం దానికి మార్గాలు లేవు. సినిమాల్లో సూపర్ హీరోల్లా ఎగురుతూ తిరగడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే, ఒక యువకుడు గాల్లో అచ్చం సూపర్ మాన్ లా తిరిగేశాడు. ఇతను అలా ఎలా తిరిగాడో తెలుసా? డ్రోన్ పై నిలబడి.

డ్రోన్ అంటే తెలుసుకదా.. మనకి పెళ్లి వీడియోల షూటింగ్ లలోనూ.. ట్రాఫిక్ పోలీసుల పహారాలోనూ గాలిలో కెమేరాలతో తిరుగుతూ ఉంటాయి. మరి మనుషులను ఎక్కించుకు తిరిగే డ్రోన్ లు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోవద్దు. కెమెరాలు గాలిలో తిరగగా లేనిది మనుషులు తిరగలేరా? ఇప్పుడు చాలా దేశాల్లో పార్సిల్స్ డెలివరీ చేసేందుకు కొరియర్ సంస్థలు డ్రోన్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయి. మరి ముందు ముందు డ్రోన్ లలో మనుషులు ఎక్కి తిరిగే రోజు రాదని ఏమన్నా ఉందా? సరే, అలా మనుషులంతా తిరిగే రోజు వస్తుందో లేదో పక్కన పెడితే, ఒక యువకుడు మాత్రం డ్రోన్ మీద షికార్లు కొట్టేశాడు. ట్రాఫిక్ రోడ్డు మీద కార్ల మధ్య నుంచి దూసుకుపోయాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎర్రలైట్ పడితే ఆగి.. గ్రీన్ లైట్ పడగానే రయ్ మంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియో ఎక్కడ తీశారో.. ఏ దేశంలోనూ తెలియలేదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిగో ఆ వీడియో మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. అన్నట్టు అది బహుశా ప్రయోగాల్లో భాగంగా నిష్ణాతులైన వారు చేసి ఉండవచ్చు. మీరు ఇటువంటి ప్రయోగాలు చేస్తే.. ఇబ్బందులు పడొచ్చు.. పైగా డ్రోన్లను ఇటువంటి పనులకు ఉపయోగించాలంటే సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి. దీనిని గమనించగలరు. మరింకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి..

Also Read: వైరల్, ఇలా కూడా జరుగుతుందా ? ఆ మమ్మీ ఈజిప్ట్ మత గురువుది కాదు, అది గర్భిణీ అట !

దేవసేనకు పెళ్లంట… తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క:Anushka Marriage video.