SBI Home Loan: హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ..
SBI Home Loan: కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.? బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారా.? మీలాంటి వారి కోసమే శుభవార్త చెప్పింది దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ....
SBI Home Loan: కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.? బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారా.? మీలాంటి వారి కోసమే శుభవార్త చెప్పింది దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఎస్‌బీఐ. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తాజాగా ఎస్‌బీఐ ఓ ప్రకటన జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. గృహ రుణాలను తీసుకునే వారికి 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా మరో బంపరాఫర్ ప్రకటించింది. మహిళ రుణ గ్రహీతలకు 5 బేసిక్ పాయింట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. యోనో యాప్ నుంచి రుణాలను తీసుకున్న వినియోగదారులకు 5 బేసిక్ పాయింట్ల రాయితీని ఇవ్వనుంది. ఈ విషయమై ఎస్‌బీఐ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. గృహ రుణ మార్కెట్లో ఖాతాదారులను సంతృప్తి పరచడానికి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పుడు ప్రకటించిన ఈ కొత్త రుణ వడ్డీ రేట్లతో వినియోగదారులకు రుణాలు తీసుకునే స్థోమత పెరుగుతుందన్నారు. ఇది ఈఎంఐ మొత్తాన్ని కూడా భారీగా తగ్గిస్తుందని ఈ కారణంగా రియల్ ఎస్టేట్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని శెట్టి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ 6.70 శాతం వడ్డీ రూ. 30 లక్షల వరకు రుణం తీసుకున్న వారికి వర్తిస్తుంది. ఇక.. రూ. 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు 6.95 శాతం . రూ. 75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు అందిస్తామని ఎస్‌బీఐ ప్రతినిధులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు విడుదల..! గత నెలతో పోల్చితే తగ్గుదల.. ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే..!