PF ఖాతాదారులకు అలర్ట్.. ఉద్యోగం మారారా ? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే…

PF Account: మీరు కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారా ? ఇటీవలే ఆ ఉద్యోగం వదిలేసి మరో జాబ్ కు మారారా ? అయితే మీరు ఈ విషయాలను

PF ఖాతాదారులకు అలర్ట్.. ఉద్యోగం మారారా ? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే...
Epfo
Follow us

|

Updated on: May 02, 2021 | 12:01 PM

PF Account: మీరు కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారా ? ఇటీవలే ఆ ఉద్యోగం వదిలేసి మరో జాబ్ కు మారారా ? అయితే మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ సేవలు అందిస్తోంది. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగి నెలవారీ జీతంలో కొంత మొత్తం ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్‏కు వెళ్తుంది. కానీ చాలా మంది ఎప్పుడూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఇలా ఉద్యోగం మారినప్పుడు కొంత మంది పీఎఫ్ డబ్బులు కూడా విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే మరికొంత మంది మాత్రం తమ పీఎఫ్ అకౌంట్ ను కొత్త కంపెనీకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం ఆ అకౌంట్ అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం అసలు మంచిది కాదు. Employees’ Provident Fund Organisation

మీరు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బులు కూడా ట్రాన్స్‏ఫర్ చేసుకోవాలి. ఒకవేళ పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‏ఫర్ చేసుకోకపోతే.. మీ ఈపీఎఫ్ డబ్బులపై వడ్డీ వస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ అమౌంట్ పై 8.5 శాతం వడ్డీ పొందవచ్చు. అయితే మీ పీఎఫ్ ఖాతాలోకి డబ్బులు డిపాజిట్ కావడం ఆగిపోవడం కారణంగా మీరు పొందిన వడ్డీ మొత్తం పై పన్ను భారం పడుతుంది. PF Account Transfer అంతేకాకుండా దీర్ఘకాలంలో అంటే రిటైర్మెంట్ సమయంలో మీరు పొందే డబ్బులు కూడా తగ్గుతాయి.

Also Read: అదిరిపోయే ఆప్షన్.. రోజుకు రూ.50 ఆదా చేస్తే.. రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకుందామా..

PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్‏న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..

Gold Price Today: మరోసారి శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్‏లో రేట్స్ ఇలా ఉన్నాయి..

Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంక్స్ బంద్.. ఈనెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..