Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంక్స్ బంద్.. ఈనెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..
Bank HoliDays In May 2021: ఏదైనా పనిమీద బ్యాంకుకు వెళ్లాలి అనుకుంటున్నారా ? అయితే ఒక్కక్షణం ఆగండి. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులకు సెలవులు
Bank HoliDays In May 2021: ఏదైనా పనిమీద బ్యాంకుకు వెళ్లాలి అనుకుంటున్నారా ? అయితే ఒక్కక్షణం ఆగండి. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకొని వెళ్ళండి.. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మే నెలలో మీకు బ్యాంకులకు వెళ్ళాల్సిన పనులు ఏవైనా ఉంటే ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువగానే సెలవులు ఉన్నాయి. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పటివరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుంటే మరింత మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు మే నెలలో 12 రోజులు సెలవులు ఉన్నాయి.
మే 1, 2021న మే డే/ లేబర్ డే May Day, మే 2న ఆదివారం కావడం.. మే 7, 2021 జుమత్ ఉల్ విదా, మే 8, 2021 రెండో శనివారం, మే 9, 2021 ఆదివారం అలాగే.. మే 13, 2021 రంజాన్, మే 14, 2021 భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి/Akshaya Tritiya, మే 16, 2021ఆదివారం, మే 22, 2021 నాలుగో శనివారం, మే 23, 2021 ఆదివారం, మే 26, 2021 బుద్ధ పూర్ణిమ, మే 30, 2021 ఆదివారం ఉండనున్నాయి.
ఇదిలా ఉంటే.. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతూంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ లా ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి.
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇక నుంచి సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం.. ఎందుకంటే..!
కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..