Lock Down Fear: లాక్ డౌన్ భయం.. బ్యాంకుల నుంచి డబ్బులు తీసి పెట్టుకుంటున్న జనం! ఆర్బీఐ నివేదికలో వెల్లడి!

కరోనా కల్లోలం ప్రజల్లో కనీ, వినీ ఎరుగని భయాన్ని కలగచేస్తోంది. ఒక పక్క ఎక్కడి నుంచి కరోనా వచ్చి పడుతుందో అనే భయం.. మరోపక్క కరోనా విరుచుకుపడుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ పెడతారేమో అనే ప్రచారం.

Lock Down Fear: లాక్ డౌన్ భయం.. బ్యాంకుల నుంచి డబ్బులు తీసి పెట్టుకుంటున్న జనం! ఆర్బీఐ నివేదికలో వెల్లడి!
Cash Withdraw
Follow us

|

Updated on: Apr 29, 2021 | 1:15 PM

Lock Down Fear: కరోనా కల్లోలం ప్రజల్లో కనీ, వినీ ఎరుగని భయాన్ని కలగచేస్తోంది. ఒక పక్క ఎక్కడి నుంచి కరోనా వచ్చి పడుతుందో అనే భయం.. మరోపక్క కరోనా విరుచుకుపడుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ పెడతారేమో అనే ప్రచారం.. ప్రజల్ని బాంకుల ముందు క్యూ కట్టిస్తోంది. నిజానికి ఆన్ లైన్ పేమెంట్ అవకాశం ఉన్నా.. ఎక్కువ మంది దాని మీద ఆధారపడటానికి ఇష్టపడటం లేదు. చేతిలో కొంతైనా నగదు ఉండాలని భావిస్తున్నారు. గత లాక్ డౌన్ సమయంలో అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అందరూ ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నివేదికలో పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. వాటిలో ప్రధానమైనది బ్యాంకుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నగదు ఉపసంహరించుకుంటున్నారు.

కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న సమయంలో.. లాక్ డౌన్ తో ప్రభుత్వం కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తుందనే వార్తల నేపధ్యంలో ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బులు భారీగా విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఆర్‌బీఐ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం 15 రోజుల్లోనే భారీగా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఏప్రిల్ 9 నాటికి ప్రజల వద్ద ఉన్న సొమ్ము.. అంతకు ముందు పదిహేను రోజుల కాలంతో పోలిస్తే.. 30,191 కోట్ల రూపాయల పెరుగుదల కనబరిచింది. మొత్తంగా చూస్తే ప్రజల వద్ద ఇప్పుడు ఉన్న నగదు 27.87 లక్షల కోట్ల రూపాయలు.

ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 9 మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న డబ్బు దాదాపు 52,928 కోట్ల రూపాయలు పెరిగాయి. లాక్ డౌన్ విధించవచ్చనే భయమే అందుకు కారణంగా భావిస్తున్నారు. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే, ఇంట్లో నగదు ఉంటే అవసరానికి పనికొస్తుందని ప్రజలు భావిస్తున్నారని అంచనా. అందుకే బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అందువలెనే, క్యా్ష్ విత్‌డ్రాయెల్స్ భారీగా పెరిగాయి.

గత ఏడాది కూడా కరోనా పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బులు ఎక్కువగానే ఉపసంహరించుకుని, దగ్గర పెట్టుకున్నారు. 2020 మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రూ.22.55 లక్షల కోట్ల నుంచి రూ.25.62 లక్షల కోట్లకు చేరింది. లాక్ డౌన్ నేపథ్యంలో క్యాష్ ఎమర్జెనీకి ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ప్రజలు ఇలా చేశారు. పూర్తిగా ఆన్లైన్ మీద ఆధారపడటం వలన అనుకోని సమస్య తలెత్తితే చేతిలో సొమ్ము ఉపయోగపడుతుందని ఎక్కువ శాతం ప్రజలు భావిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో తరచూ తలెత్తే ఇబ్బందుల అనుభవమూ ప్రజలు తమ చేతిలో డబ్బులు ఉండాలని భావిస్తుండటానికి కారణమని చెప్పొచ్చు.

Also Read: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. ఇక నుంచి సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం.. ఎందుకంటే..!