Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇక నుంచి సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం.. ఎందుకంటే..!
LPG Gas Cylinder Home Delivery: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు కావడంతో...
LPG Gas Cylinder Home Delivery: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా ప్రభావం అన్నింటిపై పడుతోంది. తాజాగా ఆ ప్రభావం గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు కూడా పడుతోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే వెంటనే లేదా ఒక రోజు సమయం పట్టేది. కానీ కోవిడ్ కారణంగా మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే చాలా నగరాల్లో కరోనాతో లాక్‌డౌన్, నౌట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కరోనాతో గ్యాస్ కంపెనీలో చాలా మంది కరోనా బారినపడ్డారు. దీని వల్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
కాగా, గత ఇరవై రోజుల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరి విషయంలో వెయిటింగ్ పీరియడ్ మూడు రోజులు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు సిలిండర్ల కోసం మరింత వేచి చూసే అవకాశం ఉంది. అంతేకాదు వచ్చే నెలలో కరోనా కేసులున్న ప్రాంతాల్లో 4 నుంచి 5 రోజుల వరకు గ్యాస్ సిలిండర్ పంపిణీలో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే గత ఏడాది 5 శాతం వరకు సిలిండర్ల పంపిణీ చేసేవారు కరోనా బారినపడినట్లు నివేదికలు చెబుతుండగా, ఈ సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇక ఇలాంటి సమయంలో పేటీఎం కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను పేటీఎం నుంచి బుక్ చేసుకున్న వారికి రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ అందించనున్నట్లు తెలిపింది. అది కూడా మొదటి సారిగా పేటీఎం నుంచి బుక్ చేసుకునే వారి కోసం మాత్రమేనని పేటీఎం సంస్థ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఏ ఏజెన్సీ నుంచైనా సిలిండర్ తీసుకోవచ్చు..!
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ స్పెషల్ సేల్.. భారీ డిస్కౌంట్.. ఎప్పటి నుంచి అంటే..!
Indane Gas Booking: మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..? ఈ నెంబర్ చెబితేనే గ్యాస్ డెలివరి అవుతుంది..!