Google: కరోనాతో ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా గూగుల్‌ సంస్థకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?

Google Work From Home: కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దాదాపు ప్రపంచమంతా పూర్తిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చిన్నా పెద్ద కంపెనీల ఉద్యోగులందరూ..

Google: కరోనాతో ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా గూగుల్‌ సంస్థకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?
Google
Follow us
Subhash Goud

|

Updated on: May 02, 2021 | 9:08 AM

Google Work From Home: కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దాదాపు ప్రపంచమంతా పూర్తిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చిన్నా పెద్ద కంపెనీల ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రం చేస్తున్నారు. ఇది ఉద్యోగులకు, కార్పొరేట్‌ కంపెనీలకు ఎంతో కలిసి వచ్చింది. ముఖ్యంగా గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ తదితర కంపెనీలకు పలు రకాలుగా ఖర్చు పెద్ద మొత్తం తగ్గిపోయింది. గూగుల్‌కు ఒక బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు తగ్గిందట. సుమారు 7,400 కోట్ల వరకు గూగుల్‌ ఆదా చేసింది.

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. గూగుల్‌ పేరెంట్‌ అల్ఫాబెట్‌ మొదటి త్రైమాసికంలో, ప్రమోషన్లు, ప్రయాణాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ వినోదానికి సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే 268 మిలియన్లను ఆదా చేసిందట. ఇక వార్షిక ప్రాతిపదికన ఒక బిలియన్లకు పైగా ఉంటుందని కంపెనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ ఈవెంట్‌ల కారణంగా 2020లో గూగుల్‌ ప్రకటనలు ప్రచార ఖర్చులు 1.4 బిలియన్ డాలర్లు తగ్గాయని ఆల్ఫాబెట్ తెలిపింది. అలాగే ప్రయాణ, వినోద ఖర్చులు 371 మిలియన్ డాలర్లు తగ్గాయి. గూగుల్ ఈ పొదుపును కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఉపయోగించినట్లు నివేదిక వెల్లడించింది. మహమ్మారి కారణంగా సంస్థలో మార్కెటింగ్, పరిపాలనా ఖర్చులు చాలా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఇతర టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా, గూగుల్ ఈ సంవత్సరం సెప్టెంబరు నెలలో తన కార్యాలయాలను తెరవనున్నామని పేర్కొంది. ఇది ఆయా దేశాల కోవిడ్‌ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. గూగుల్ ‘హైబ్రిడ్’ మోడల్‌లో ఉద్యోగులు తగినంత దూరంలో కూర్చొని సేవలందిస్తారని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ పేర్కన్నారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌లో గూగుల్ పెట్టుబడులు పెట్టడం కొనసాగుతుందని చెప్పారు.

ఇవీ కూాడా చదవండి:

LPG Cylinder Booking: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త.. ఏ ఏజెన్సీ నుంచైనా సిలిండర్‌ తీసుకోవచ్చు..!

Maruti suzuki: కారు కొనేవారికి శుభవార్త.. లక్షా 90 వేలకు మారుతి సుజుకీ స్విఫ్ట్ ఎల్‌డీఐ కారు..

SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఆ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు