చిరంజీవితో నటించిన ఆ హీరోయిన్‌ను ఇప్పుడు గుర్తుపట్టగలరా..? ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

Heroine Meenakshi Seshadri : మీనాక్షి శేషాద్రి.. 80, 90 దశకంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఆ కాలంలోనే అత్యధిక పారితోషికం

  • uppula Raju
  • Publish Date - 7:49 pm, Mon, 3 May 21
చిరంజీవితో నటించిన ఆ హీరోయిన్‌ను ఇప్పుడు గుర్తుపట్టగలరా..? ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!
Meenakshi Seshadri

Heroine Meenakshi Seshadri : మీనాక్షి శేషాద్రి.. 80, 90 దశకంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఆ కాలంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా గుర్తింపు సాధించింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీలో కూడా నటించి తనకంటూ ఓ గుర్తింపును సాధించింది. ఆమె అభినయానికి ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఆపద్భాందవుడు సినిమాతో ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు.

అయితే కెరియర్ పీక్స్‌లో ఉండగానే ఈ అమ్మడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అనంతరం అమెరికాలో స్థిరపడింది. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధ్రిలో జన్మించింది. తమిళ కుటుంబానికి చెందిన ఈమె.. భరతనాట్యం, కూచిపూడి, కథక్, లాంటి డాన్సులలో ప్రావీణ్యం గడించింది. ఆమె ఈవ్స్‌ వీక్లీ మిస్‌ ఇండియా కాంపిటీషన్‌లో పాల్గొని గుర్తింపు సాధించింది. మోడల్ గా అవకాశాలు రావడంతో టాప్ మెడల్ గా పేరు తెచ్చుకుంది. అదే ఆమెను సినీ జీవితం వైపు నడిపించాయి.

పెయింటర్ బాబుతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి, సుభాష్‌ ఘాయ్‌ డైరక్షన్‌లో హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఒక్కరోజులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్ని డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడ్డారు. మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం. టెక్సాస్‌లో భారతీయ సంప్రదాయ నృత్యాల శిక్షకురాలిగా బిజీగా ఉన్నారు.

అంతేకాకుండా సమాజసేవ, అందుకు సంబంధించి నిధుల సేకరణ చేపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఎంతో ముద్దుగా అందంగా ఉండే మీనాక్షి శేషాద్రి పూర్తిగా మారిపోయారు. మెరుపు తీగలా ఉండే ఆమె ప్రేక్షకులు ఊహించుకోలేని విధంగా కనిపించడంతో ఒక రకమైన షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Siddartha Chowdary: ఉక్కు మనిషిని సైతం పిండి చేస్తున్న కరోనా.. తాజాగా మరో బాడీబిల్డర్ సిద్దార్ధ్ చౌదరి కోవిడ్‌తో మృతి

‘ఇందువదన’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో.. నయా లుక్కులో వరుణ్ సందేశ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..