ఎన్టీఆర్‏కు ఆ సీనియర్ హీరో… మరోసారి బ్లాక్ బస్టర్ కోసం స్క్రిప్ట్‏లో మార్పులు చేస్తున్న కొరటాల..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ

ఎన్టీఆర్‏కు ఆ సీనియర్ హీరో... మరోసారి బ్లాక్ బస్టర్ కోసం స్క్రిప్ట్‏లో మార్పులు చేస్తున్న కొరటాల..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: May 03, 2021 | 5:38 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణకు కరోనా సెకండ్ వేవ్ అడ్డుగా నిలిచింది. దీంతో ఆచార్య మూవీ షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఆచార్యకి మరో నెల రోజులు గ్యాప్ వచ్చింది. ఇక కొరటాల శివ ఈ గ్యాప్‏ను ఎన్టీఆర్ స్క్రిప్ట్ కోసం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రస్తుతం ఎన్టీఆర్ కు రాబోయే పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని కొరటాల ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అందుకోసం స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నాడట. నిజానికి గతంలోనే ఈ స్క్రిప్ట్ ను ఫినిష్ చేశాడట. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా కొరటాల మెసేజ్‏తో సాగే పక్కా ఎంటర్ టైనర్ గా తీస్తాడట. మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా కొరటాల ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎన్టీఆర్‏కు విలన్‏గా సీనియర్ హీరో అరవింద్ స్వామి కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ ఉంటుందట .. అదే సమయంలో ఆ పాత్ర పన్నే వ్యూహాలు .. దెబ్బతీసే విధానం వెరైటీగా ఉంటాయట. అందువలన విలన్ పాత్రలకు చాలామంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించిన కొరటాల అరవిందస్వామి అయితే కరెక్టుగా ఉంటాడనే అభిప్రాయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ‘ధ్రువ’ సినిమాకి విలన్ గా అరవింద్ స్వామి ఎంత ప్లస్ అయ్యాడనే విషయం తెలిసిందే. అందువలన ఆయననే సంప్ర్రదించే ఆలోచనలో ఉన్నారని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అరవింద్ స్వామి చేతిలో అరడజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ? లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Also Read: Salaar Movie: ‘సలార్’ సినిమాలో మరో హీరోయిన్.. ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ..

పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్.. వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్న త్రిష ?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!