ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటున్న హీరో కార్తి… త్వరలో రానున్న క్లారిటీ

తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కార్తి. యుగానికొక్కడు సినిమా తో కార్తి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటున్న హీరో కార్తి... త్వరలో రానున్న క్లారిటీ
Hero Karthi

hero karthi: తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కార్తి. యుగానికొక్కడు సినిమా తో కార్తి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న మైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత వచ్చిన ఆవారా సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ హీరో. రెగ్యులర్ కథలు కాకుండా కంటెంట్ లో కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తూ కార్తి మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక కార్తీ నటించిన ఖాకి , ఖైదీ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు కార్తి.

ఇటీవలే సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తి. ఈ సినిమా తమిళ్ లో మంచి టాక్ తెచ్చుకోగా తెలుగులో పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక తమిళ్ లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ఖాకీ’ సీక్వెల్ గానీ .. ‘ఖైదీ’ సీక్వెల్ గాని చేయాలని కార్తి నిర్ణయించుకున్నాడట. ఖాకీ’ సినిమా చేసిన హెచ్.వినోత్ ప్రస్తుతం అజిత్ హీరోగా ‘వలిమై’ చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుకు అవసరమైన కథను కూడా రెడీ చేసుకోమని ఆయనకి అజిత్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ‘ఖైదీ’ సినిమాను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ కమల్ కథనాయకుడిగా ‘విక్రమ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయనకి దళపతి విజయ్ .. రజనీల సినిమాలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్రీ అయితే ఖాకీ, ఖైదీ సినిమాల్లో ఒక సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

RGV on PM Modi: మోడీ మృత్యు వ్యాపారి అంటూ నిజం చెప్పిన సోనియా గాంధీ కాళ్ళను మొక్కుతా అంటున్న ఆర్జీవీ

Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ … మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్