AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: త‌న లైఫ్ లో అద్భుతమైన ఫేజ్ ఇదే అంటున్న శ్రుతి హాసన్.. బాయ్‌ ఫ్రెండ్ గురించి ఏం చెప్పిందంటే

ప్రొఫెషనల్ కెరీర్‌ విషయంలోనే కాదు పర్సనల్‌ లైఫ్‌ విషయంలోనూ నేను చాలా ఓపెన్‌గా ఉంటానంటున్నారు...

Shruti Haasan: త‌న లైఫ్ లో అద్భుతమైన ఫేజ్ ఇదే అంటున్న శ్రుతి హాసన్.. బాయ్‌ ఫ్రెండ్ గురించి ఏం చెప్పిందంటే
Shruti Haasan
Ram Naramaneni
|

Updated on: May 03, 2021 | 11:43 AM

Share

ప్రొఫెషనల్ కెరీర్‌ విషయంలోనే కాదు పర్సనల్‌ లైఫ్‌ విషయంలోనూ నేను చాలా ఓపెన్‌గా ఉంటానంటున్నారు మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్. రీ ఎంట్రీలో బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌లు సాధిస్తున్న ఈ స్టార్ కిడ్‌ పర్సనల్‌ లైఫ్‌లోనూ బిగ్ చేంజ్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య తరుచూ తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి చెట్టా పట్టాలేసుకొని చక్కర్లు కొడుతున్నారు. అయితే ఈ విషయంలోనే సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపించాయి. గతంలో ఒకరితో రిలేషన్‌షిప్‌ బ్రేకప్‌ కారణంగానే శ్రుతి పర్సనల్‌ లైఫ్ డిస్ట్రబ్‌ అయ్యింది. ఆ కారణంగా ఫిలిం కెరీర్‌ కూడా కష్టాల్లో పడింది. కాస్త సర్దుకొని సినిమాల్లో బిజీ అవుతున్న టైమ్‌లో మళ్లీ ఇలాంటి రిలేషన్స్ అవసరమా అంటూ కామెంట్లు వినిపించాయి.

ఈ కామెంట్స్‌పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు శ్రుతి హాసన్‌. ఐయామ్ ఇన్‌ లవ్‌ అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా… ప్రజెంట్ నా లైఫ్‌లో అద్భుతమైన ఫేజ్‌ నడుస్తోంది అంటూ తన హ్యాపీనెస్‌ను షేర్ చేసుకున్నారు. అంతేకాదు బాయ్‌ ఫ్రెండ్‌ శాంతనుతో స్నేహాన్ని మించిన గొప్ప బంధం అంటూ తమ రిలేషన్‌ గురించి చెప్పకనే చెప్పేశారు.

Also Read: తెలంగాణ ప్రజలకు ఊరట.. తగ్గిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఎన్నికేసులంటే..

ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటున్న హీరో కార్తి… త్వరలో రానున్న క్లారిటీ