AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana: ప్రెగ్నెంట్.. అబార్షన్.. ఆత్మహత్యాయత్నం.. అసలు మ్యాటర్ చెప్పిన ఇలియానా..

Ileana D Cruz: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా పరిచయమైన దేవదాసు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా.

Ileana: ప్రెగ్నెంట్.. అబార్షన్.. ఆత్మహత్యాయత్నం.. అసలు మ్యాటర్ చెప్పిన ఇలియానా..
ఆ మధ్య తెలుగులో కేవలం తనను గ్లామర్ పాత్రలకే అంకితం చేసారని అందుకే నాకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకలేదని వాపోయింది. 
Rajitha Chanti
|

Updated on: May 03, 2021 | 7:32 PM

Share

Ileana D Cruz: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా పరిచయమైన దేవదాసు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. వరుస అవకాశాలను అందుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించిన ఇలియానా.. అటు బాలీవుడ్‏లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఇలియానాకు తెలుగులో ఆశించినంతగా అవకాశాలు రాలేదు. చిన్న వయసులోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇలియానాకు వివాదాలు కూడా ఎక్కువగానే నమోదుచేసుకుంది. గతంలో ఇలియానా ప్రెగ్నెంట్ అని.. కానీ అబార్షన్ చేసుకుందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్యయత్నం కూడా చేసిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై ఇలియానా స్పంధించింది.

ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ.. నా గురించి చాలా పుకార్లు వచ్చాయి. నేను అబార్షన్ చేసుకోబోతున్నానని చాలా మంది రకారకాలుగా మాట్లాడారు. అది విని నాకు చాలా బాధేసింది. మరీ ఇంత దారుణమా అనుకున్నా.. ఇక ఇంకోసారి ఏకంగా నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని.. ఆ సమయంలో మా పనిమనిషి చూసి నన్ను ఆపిందని కథనాలు వచ్చాయి. కానీ నిజానికి నాకు పనిమనిషులు లేరు. నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇంకా బతికే ఉన్నాను. అయినా ఇలాంటి పిచ్చిపిచ్చి వార్తలు ఎందుకు రాస్తారో అర్థం కావడం లేదు అంటూ తెలిపింది. గతంలో ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. ఎప్పుడు వీరిద్ధరి కలిసి కెమెరాలకు చిక్కడంతో చాలా రోజులుగా వీరిద్ధరి విషయంపై వార్తలు వచ్చేవి. 2018లో తన బాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై మండిపడ్డ ఆమె తను గర్భవతిని కాదంటూ వార్తలకు పుల్ స్టాప్ పెట్టింది.

Also Read: ఎన్టీఆర్‏కు ఆ సీనియర్ హీరో… మరోసారి బ్లాక్ బస్టర్ కోసం స్క్రిప్ట్‏లో మార్పులు చేస్తున్న కొరటాల..

నా ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‏లోనే ఉన్నాను.. స్వల్ప లక్షణాలున్నాయి.. అల్లు అర్జున్ ట్వీట్..

Salaar Movie: ‘సలార్’ సినిమాలో మరో హీరోయిన్.. ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ..