AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‏కు జోడీగా ఆ హీరోయిన్ ?

సినీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కబురు రానే వచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ అనౌన్స్ అయ్యింది. హారిక హాసినీ క్రియేషన్స్ పై రూపొందుతున్న

మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‏కు జోడీగా ఆ హీరోయిన్ ?
Rajitha Chanti
|

Updated on: May 03, 2021 | 10:41 PM

Share

సినీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కబురు రానే వచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ అనౌన్స్ అయ్యింది. హారిక హాసినీ క్రియేషన్స్ పై రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ఏంటి..? కథ ఎలా ఉండబోతుంది..? అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. 11 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అనౌన్స్‏మెంట్ కంటే ముందు నుంచే ఇండస్ట్రీలో వీరిద్ధరి కాంబోలో రాబోయే సినిమా గురించి అనేక రూమర్స్ వచ్చాయి.

మహేశ్, త్రివిక్రమ్ మధ్య వచ్చిన ఫస్ట్ సినిమా అతడు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ఖలేజా కూడా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ మూవీపై ఓ లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకుంటున్నారట. త్రివిక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురం మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది. ఇటు మహేశ్ తో మహర్షి మూవీలో కూడా పూజానే హీరోయిన్. దీంతో ఈ ప్రాజెక్ట్ లో తనకే మరోసారి ఛాన్స్ ఇస్తారంటున్నాయి సినీ వర్గాలు. అలాగే గత చిత్రాల మాదిరిగా ఈ సినిమాలో మహేశ్ యాక్షన్ ఉండబోదని టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోను కొత్తగా చూపించేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. అలాగే ఈ మూవీ టైటిల్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. అయితే అన్నింటికీ చెక్ పెట్టేస్తూ.. ఈ నెల 31 న అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని సమాచారం. మహేశ్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ వారసురాలు.. హీరో ఎవరంటే..

కరోనా పోరులో మేము సైతం అంటున్న టాలీవుడ్ హీరోలు.. ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్న తారలు..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..