- Telugu News Photo Gallery Cinema photos Senior heroine vani vishwanath sister priya vishwanath daughter varsha vishwanath entry in tollywood industry
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ వారసురాలు.. హీరో ఎవరంటే..
వెండితెరపై తమను తాము నిరుపించుకోవడానికి ఎంతోమంది హీరోయిన్స్‌గా ఒక్క అవకాశం వచ్చిన చాలు అంటూ ఎదురుచూస్తుంటారు. ఇక మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. వరుస ఆఫర్లను అందుకుంటుంటారు. ఇక ఇప్పటివరకు పలువురు నటీనటుల కూతుర్లు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వారసురాలు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Updated on: May 03, 2021 | 10:38 PM

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ సోదరి ప్రియావిశ్వనాథ్ కూతురు. వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు వర్షా విశ్వనాథ్.

కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్ పూర్తి చేసిన వర్షా విశ్వనాథ్ తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.

రమణ్ కథానాయకుడిగా శిరీషారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేశ్, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్షా పక్కింటి అమ్మాయిగా కనిపించనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు.

ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు వర్షా. రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు.

ఇవే కాకుండా.. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్ అంగీకరించారు. ఇవి కాకుండా తమిళంలోనూ సినిమాల్లో నటించారు వర్షా విశ్వానాథ్.

వర్షా విశ్వనాథ్.




