Anupama Pawan Kalyan: వ‌కీల్‌సాబ్ చూశాన‌ని పోస్ట్ చేసిన అనుప‌మ‌.. మండిప‌డుతోన్న ప‌వ‌న్ అభిమానులు.. ఎందుకో తెలుసా.?

Anupama Pawan Kalyan: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీగా వ‌చ్చిన చిత్రం వ‌కీల్‌సాబ్‌. బాలీవుడ్‌లో తెర‌కెక్కిన పింక్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప‌వ‌న్...

Anupama Pawan Kalyan: వ‌కీల్‌సాబ్ చూశాన‌ని పోస్ట్ చేసిన అనుప‌మ‌.. మండిప‌డుతోన్న ప‌వ‌న్ అభిమానులు.. ఎందుకో తెలుసా.?
Anupama Pawnkalyan
Follow us
Narender Vaitla

|

Updated on: May 04, 2021 | 6:21 AM

Anupama Pawan Kalyan: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీగా వ‌చ్చిన చిత్రం వ‌కీల్‌సాబ్‌. బాలీవుడ్‌లో తెర‌కెక్కిన పింక్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లు క‌థ‌లో మార్పులు చేసి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడిగా మంచి మార్కులు కొట్టేశారు. ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ అమేజాన్ ప్రైమ్‌లో సంద‌డి చేస్తోంది. దీంతో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ అమేజాన్‌లో సినిమాలను చూశామంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా వ‌కీల్‌సాబ్ చూసిన‌ట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే అనుప‌మపై ప‌వ‌న్ ఫ్యాన్స్ గుర్రున ఉన్నారు. సినిమా చూశాన‌ని పోస్ట్ చేస్తే కోపంగా ఎందుకు ఉన్నార‌నేగా మీ డౌట్‌… అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఇటీవ‌ల అమేజాన్ ప్రైమ్‌లో సినిమా చూసిన అనుప‌మ ఈ విష‌యాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో.. “తాజాగా వ‌కీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వ‌చ్చిన ఈ సినిమాలో అంద‌రి న‌ట‌న అద్భుతంగా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముగ్గురు అమ్మాయిల‌ను కాపాడే పాత్ర‌తో హ‌ద్దుల‌ను చెరిపేశారు. ప్ర‌కాశ్ రాజ్ స‌ర్‌.. మీ న‌ట‌న అద్భుతం” అంటూ క్యాప్ష‌న్ జోడించారు. అయితే అనుప‌మ ఇక్క‌డే దొరికి పోయింది. ట్వీట్‌లో కేవ‌లం ప్రకాశ్ రాజ్‌నే సార్ అని సంబోధించ‌డంతో… ప‌వ‌న్ అభిమానులు.. “కేవ‌లం ప్ర‌కాశ్ రాజ్ ఒక్క‌రే మీకు సార్ ఆ..?” అంటూ కామెంట్లు కుర‌పించారు. దీంతో అనుప‌మ నోరు క‌రుచుకొని వెంట‌నే మ‌రో ట్వీట్ చేశారు. “న‌న్ను క్ష‌మించండి నా త‌ప్పును తెలుసుకున్నాను. ప‌వ‌న్ కళ్యాణ్ గారిపై నా ప్రేమ‌, గౌర‌వం ఎప్పుడూ ఉంటుంది” అంటూ ట్వీట్ చేశారు.

అనుప‌మ చేసిన ట్వీట్‌లు..

Also Read: మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‏కు జోడీగా ఆ హీరోయిన్ ?

కరోనా పోరులో మేము సైతం అంటున్న టాలీవుడ్ హీరోలు.. ప్లాస్మా దానం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్న తారలు..

చిరంజీవితో నటించిన ఆ హీరోయిన్‌ను ఇప్పుడు గుర్తుపట్టగలరా..? ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!