Mahesh Babu And Pawan Kalyan : సీక్వెల్స్ పైన దృష్టిపెడుతున్న సూపర్ స్టార్, పవర్ స్టార్

నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. అనే పాపులర్ డైలాగ్ ని ఇంకా మర్చిపోలేక పోతున్నారు సూపర్ స్టార్ మహేష్. మైండ్ బ్లాక్ పాటయితే ఆయన గుండెల్ని ఇంకా మీటుతూనే వుంది.

  • Rajeev Rayala
  • Publish Date - 3:01 pm, Tue, 4 May 21
Mahesh Babu And Pawan Kalyan : సీక్వెల్స్ పైన దృష్టిపెడుతున్న సూపర్ స్టార్, పవర్ స్టార్

Mahesh Babu And Pawan Kalyan :

నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. అనే పాపులర్ డైలాగ్ ని ఇంకా మర్చిపోలేక పోతున్నారు సూపర్ స్టార్ మహేష్. మైండ్ బ్లాక్ పాటయితే ఆయన గుండెల్ని ఇంకా మీటుతూనే వుంది. ఇటు.. వకీల్ సాబ్ అయితే.. తన నల్లకోటు గెటప్ ని మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నారు. మిగతా సినిమాలతో బిజీగా ఉంటూనే.. వీళ్ళిద్దరూ ఒక్క విషయంలో మాత్రం బాగా సింకవుతున్నారు. ఇంతకీ అదేమిటంటే..పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వున్న ఆకతాయి కుర్రాళ్ళ నుంచి ముగ్గురమ్మాయిల జీవితాల్ని కాపాడిన దేవుడిగా వకీల్ సాబ్ సక్సెస్ అయ్యాడు. పింక్ లాంటి రా అండ్ డ్రై సబ్జెక్టుని తన ఇమేజ్ కి తగ్గట్టు మార్చి రాసిన వేణు శ్రీరామ్ ప్రతిభకు ఫ్లాట్ అయ్యారు పవర్ స్టార్. అందుకే.. మనిద్దరం కలిసి మరో సినిమా చేద్దామా అని కన్నుగీటుతున్నారట. ఏదో ఎందుకు.. వకీల్ సాబ్ కే సీక్వెల్ రాసిపెట్టు.. ఆలోగా నేను మిగతా సినిమాలు కంప్లీట్ చేసుకొస్తా అని మాటిచ్చారట పవన్ కళ్యాణ్. ఈ ఐడియాకు మొదట్లో మొగ్గ తొడిగింది దిల్ రాజేనని, త్వరలో అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని పీకే కాంపౌండ్ లో ఆ ఇంట్రస్టింగ్ సౌండ్ వినిపిస్తోంది.

మహేష్ బాబుని సూర్యుడు, చంద్రుడంత గొప్పవాడిగా చూపెడుతూనే.. గిలిగింతలు పెట్టే కామెడీతో మనలో ఒకడిగా ప్రెజెంట్ చేసి సక్సెస్ కొట్టారు పటాస్ మార్క్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. కరడుగట్టిన విలన్ ని కూడా దేశభక్తుడిగా మార్చి మిలిటరీలో చేర్పించడం ఈ కథ సారాంశం. ఇదే కథను తిరగతిప్పి మరోలా చెప్పాలన్న ఖతర్నాక్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు అనిల్ బుర్రలో ఫ్లాష్ అయిందా? మహేష్ కోసం మరో కథ రెడీగా ఉంది అని అనిల్ రావిపూడి నుంచి వస్తున్నా సిగ్నల్స్.. దీనికి సంబంధించినవే అనేది టాక్. ఇప్పుడు త్రివిక్రమ్ తో మూవీ కమిట్ కాకముందే మహేష్-అనిల్ కలిసి సరిలేరు సీక్వెల్ మీదే సీరియస్ గా వర్కవుట్ చేశారట. ప్రస్తుతానికి ఎఫ్2 సీక్వెల్ తోనే పూర్తిగా ఎంగేజ్ అయివున్న అనిల్.. ఫ్రీ అయిపోగానే.. మేజర్ అజయ్ కృష్ణ క్యారెక్టర్ ని రీ డిజైన్ చేస్తారేమో..! అటు.. ఏడాదిన్నర నుంచి పవన్ తోనే సెయిల్ చేసిన వేణు శ్రీరామ్ కూడా.. ఇకమీదట ఐకాన్ ప్రాజెక్టు మీదకు ఫోకస్ పెడతారు. గ్యాప్ దొరికితే వకీల్ సాబ్ కి కంటిన్యూయేషన్ గురించి ఆలోచిస్తారేమో! ఏదేమైనా.. పవర్ స్టార్ అండ్ సూపర్ స్టార్.. ఇద్దరూ తమతమ రీసెంట్ మూవీస్ తో బాగానే కనెక్ట్ అయ్యారన్నమాట!

మరిన్ని ఇక్కడ చదవండి :

Adipurush Movie: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్.. కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్..

యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ సర్కారు వారి పాట… సినిమాలో భారీ ఛేజింగ్ సీక్వెన్స్ ఉండనుందట ..