vamshi paidipally: మహేష్ డైరెక్టర్ భారీ ప్లాన్.. ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ ఆలోచనలో వంశీ పైడిపల్లి ..
పవన్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. టాప్ లో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ తో ధమాఖా ధార్ హిట్టు కొట్టిన పవన్.. రీసెంట్‌గా మరో యంగ్ డైరెక్టర్ చెప్పిన కథను కూడా చేసేశాడట.
vamshi paidipally: పవన్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే వకీల్ సాబ్ తో ధమాఖా ధార్ హిట్టు కొట్టిన పవన్.. రీసెంట్‌గా మరో యంగ్ డైరెక్టర్ చెప్పిన కథను కూడా చేసేశాడట. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరాని అనుకుంటున్నారా… అసలు విషయం ఏంటంటే పవన్ కల్యాణ్ మరోసారి దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక వైవిధ్యమైన చిత్రాలను తీయడంలో ముందుండే దిల్‌రాజు.. తాజాగా డైరెక్టర్ వంశీ పైడిపల్లిని పవన్ కోసం ఓ కథను రెడీ చేయమని కోరారట. ఇక దిల్ రాజు అలా కోరారో లేదో.. వెంటనే ఓ కథను పవన్ ఇమేజ్‌కు సరిపోయే ఓ కథను నరేట్ చేసేశాడట డైరెక్టర్ వంశీ. ఇక ఆ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దిల్ రాజు పవన్ తొందర్లో కథ చెప్పేందుకు రెడీగా ఉండాలని వంశీకి చెప్పారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇదే న్యూస్‌తో పాటు దిల్ రాజు ప్రొడక్షన్లో వంశీ పైడిపల్లి తమిళ హీరోతో సినిమా చేయనున్నారన్న న్యూస్ కూడా ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వంశీ తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
సెన్సబుల్గా కథలను తెరకెక్కించే వంశీ పైడి పల్లి.. విజయ్‌తో సినిమా తీయడానికి కారణం కథే అట..! ఈ కథ విజయ్ చేస్తేనే బాగుంటుందని ఫిక్స్ అయిన ఈ యంగ్ డైరెక్టర్.. దిల్ రాజుని ఒప్పించి మరీ.. ఆ తరువాత విజయ్‌ని అప్రోచ్ అయ్యారట. ఇక స్టోరీ విన్న “మాస్టర్” తన స్టైల్లో ఓకే చెప్పేశాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను డైరెక్టర్ వంశీ… బైలింగువల్ గా ఇటు తెలుగులోను అటు తమిళ్లోను ఏకకాలంలో .. తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని కొందరంటుంటే మరికొందరి వాదన వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్, విజయ్ లతో వంశీ మల్టీస్టారర్ చేయాలనీ చూస్తున్నాడని అంటున్నారు. అందుకే అటు పవన్ ను ఇటు విజయ్ ను వంశీ సంప్రదించారని ప్రచారం జరుగుతుంది. అదే కానీ నిజమైతే పవన్ అభిమానులకు దళపతి ఫ్యాన్స్ కు పండగే .. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :