‘జయం’ కథకు అన్నిచోట్లా విజయాలే.. ఇప్పుడు శాండల్ వుడ్ లో కూడా సత్తా చాటుతుందా…
అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవరకొండ ఫేట్ నే మార్చేసింది. అదే సినిమా.. హిందీలో షాహిద్ కపూర్ స్టార్ డమ్ ని రెండుమూడింతలు పెంచేసింది. ఇటువంటి ట్రెండ్ సెట్టర్ మూవీస్...
అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవరకొండ ఫేట్ నే మార్చేసింది. అదే సినిమా.. హిందీలో షాహిద్ కపూర్ స్టార్ డమ్ ని రెండుమూడింతలు పెంచేసింది. ఇటువంటి ట్రెండ్ సెట్టర్ మూవీస్ సౌత్ లో చాలానే వున్నాయి. జయం కూడా అటువంటిదే. ఇక్కడ తెలుగులో నితిన్ కి లైఫ్ ఇచ్చిన జయం.. ఎడిటర్ మోహన్ కొడుకు రవిని జయం రవిగా మార్చింది. కోలీవుడ్ లో స్టార్ హీరోని చేసింది. ఇప్పుడు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత అదే జయం మూవీని శాండల్ వుడ్ టేకప్ చేస్తోంది. ప్రవీణ్ కుమార్ అనే యువ నటుడికి బ్రేక్ ఇవ్వబోతోంది జయం మూవీ. తేజ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది. అందుకే ఎక్స్ పైరీ డేట్ లేని ఇటువంటి కథల్ని అందరూ లడ్డూల్లా భావిస్తారు.
కేజీఎఫ్ స్టార్ యష్ ని కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన శశాంక్.. ఇప్పుడు ప్రవీణ్ డెబ్యూ మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత తియ్యబోయే జయం కన్నడ రీమేక్.. అక్కడి సినీ జనాల్లో ఇప్పట్నుంచే క్రేజీగా మారింది. సో.. ముచ్చటగా మూడో హీరోకు ఫస్ట్ కిక్ ఇవ్వబోతోంది ఈ క్లాసికల్ లవ్ స్టోరీ.
Also Read: ఇళ్లు లేని నిరుపేదలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. నిర్మాణం వేగవంతం