హిందూపురం కోవిడ్‌ ఆస్పత్రి ఘటనపై బాల‌య్య ఆవేద‌న‌.. బాధిత‌ కుటుంబాల‌కు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌

కరోనా సెకండ్ వేవ్ చాలా మంది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. అనేక మంది ప్రజల ప్రాణాలను తీసి వారి బతుకులను ఛిద్రం చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...

  • Ram Naramaneni
  • Publish Date - 2:58 pm, Tue, 4 May 21
హిందూపురం కోవిడ్‌ ఆస్పత్రి ఘటనపై బాల‌య్య ఆవేద‌న‌.. బాధిత‌ కుటుంబాల‌కు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌
Photo Credits: @manabalayya/Twitter

కరోనా సెకండ్ వేవ్ చాలా మంది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. అనేక మంది ప్రజల ప్రాణాలను తీసి వారి బతుకులను ఛిద్రం చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం ఆస్పత్రిలో జరిగిన ఘటనపై బాలకృష్ణ స్పందించారు. ఆక్సిజన్‌ అందక ఎనిమిది మంది ప్రాణాల కొల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు

ముందు జాగ్రత్త లేకపోవడం …సరిగ్గా మానిటరింగ్ చేయకపోవడం, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ ఆస్పత్రిలో బాధితులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి సరైన వైద్య సౌకర్యం అందించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని అధికారులు, వైద్యులకు సూచించారు బాలయ్య. వెంటిలేటర్లు , కావలసినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి, కలెక్టర్ డీఎంఅండ్‌హెచ్ఓ‌తో మాట్లాడానని బాలకృష్ణ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయటకు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను, భౌతిక దూరం పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.

Also Read: : ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ

కేవలం 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు బీమా పొందండి… ఆ వివరాలు ఇలా తెలుసుకోండి..