Road Accident: నెల్లూరులో విషాదం.. పనికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు కూలీల దుర్మరణం..

Nellore Accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చేపల చెరువులో

  • Shaik Madarsaheb
  • Publish Date - 3:07 pm, Tue, 4 May 21
Road Accident: నెల్లూరులో విషాదం.. పనికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు కూలీల దుర్మరణం..
Road Accident In Nellore

Nellore Accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చేపల చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకురు సమీపంలో చోటుచేసుకుంది. గొల్లకందుకూర్‌కు చెందిన పలువురు ఉదయాన్నే పుచ్చకాయలు కోసే పనికి ట్రాక్టర్‌లో వెళ్తుండగా.. అదుపు తప్పి చేపల చెరువులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలు వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకోని పరిశీలించారు. మృతులు పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), అబ్బుకోటి పెంచాలయ్య(60), తాంధ్రా వెంకతరమనమ్మ(19)గా గుర్తించారు. వీళ్లంతా పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒకేసారి ఐదుగురు మృతి చెందడంతో గొల్లకందుకురు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరికాసేపట్లో పని ప్రాంతానికి చేరుకుంటారనగా.. ఈ ఘటన జరిగింది.

 

Also Read:

High Court: హైకోర్టులో జమున హెచరీస్ పిటీషన్ విచారణ.. నోటీసులు వివరాలను ఇవ్వాలని ఆదేశించిన కోర్టు

మెక్సికో సిటీలో రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్, 15 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు