AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court: హైకోర్టులో జమున హెచరీస్ పిటీషన్ విచారణ.. నోటీసులు వివరాలను ఇవ్వాలని ఆదేశించిన కోర్టు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల భార్య రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

High Court: హైకోర్టులో జమున హెచరీస్ పిటీషన్ విచారణ.. నోటీసులు వివరాలను ఇవ్వాలని ఆదేశించిన కోర్టు
Telangana High Court
Balaraju Goud
|

Updated on: May 04, 2021 | 2:56 PM

Share

Jamuna Hatcheries to High Court: మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల భార్య రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. జమున హెచరీస్ యజమానిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని ఆమె పేర్కొన్నారు. తాము ఎక్కడ కూడా కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ అనుమతి లేకుండా హెచరీస్‌లోకి ప్రవేశించి అధికారులు హంగామా చేశారని.. మెదక్ జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు.

జమునా హెచరీస్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కలెక్టర్ నివేదికపై హైకోర్ట్ సీరియస్‌గా స్పందించింది. ఓవర్‌ నైట్‌లో విచారణ చేసి నివేదిక ఇస్తారా అని ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు చట్టవిరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, మంత్రి పదవిలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇలాంటి ఫిర్యాదులు గతంలో చాలా మందిపై వచ్చాయి. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏజీని ప్రశ్నించింది హైకోర్టు. 111 జీవో అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది. అధికారులు ముందుస్తు నోటీసులు జారీ చేసారా.. ఒక వేళ జారీ చేస్తే.. ఆ ఉత్తర్వులను కోర్టుకు చూపాలని ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మద్యాహ్ననికి సమయం కోరారు ఏజీ. దీంతో తదుపరి విచారణను మద్యాహ్ననికి వాయిదా వేసింది హైకోర్టు.

మెదక్‌ కలెక్టర్‌ నివేదిక తప్పుల తడకగా ఉందంటూ హైకోర్టులో జమున హ్యాచరీస్ పిటిషన్‌ వేసింది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ జరిపారని.. పిటిషన్‌లో పేర్కొంది. విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది జమునా హెచరీస్. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా వెళ్లి సర్వే చేశారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా భూమి సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించింది జమున హెచరీస్.

Read Also…. TTD Setup: టీవీ 9 ఎఫెక్ట్ః కోవిడ్ బాధితుల కష్టాలపై స్పందించిన టీటీడీ.. జర్మన్ షెడ్లతో మినీ కోవిడ్ సెంటర్ల ఏర్పాటు