AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెక్సికో సిటీలో రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్, 15 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు

మెక్సికో సిటీలో ఓవర్ పాస్ పాక్షికంగా కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు కింద రోడ్డుపై పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు....

మెక్సికో సిటీలో రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్, 15 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు
15 Dead 70 Injured In Rail Overpass Collapse In Mexico
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 04, 2021 | 12:57 PM

Share

మెక్సికో సిటీలో ఓవర్ పాస్ పాక్షికంగా కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు కింద రోడ్డుపై పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు. 12 లైన్ల ఓవర్ పాస్…. కింద రోడ్డుపై కార్లు, ఇతర వాహనాల మీద కుప్ప కూలడాన్ని, అలాగే మెట్రో రైలు పడిపోవడాన్ని లోకల్ ఛానెల్స్, టీవీలు వీడియోలుగా చూపాయి. సమాచారం తెలియగానే స్థానికులు, వైద్య సిబ్బంది, ఫైర్ ఫైటర్లు రైలు శిథిలాల పైకి ఎక్కి సహాయక చర్యలకు ఉపక్రమించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేబట్టారు. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని, శిథిలాల్లో ఓ కారు పూర్తిగా చిక్కుకుపోయిందని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్ బమ్ తెలిపారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని, మృతులు, గాయపడినవారితో ప్రమాద స్థలి భీతావహంగా ఉందని అన్నారు. కాగా ఈ ఘటనలో మరణించినవారి సంఖ్య ఇంకా   ఎక్కువే ఉండవచ్చునని కాంప్రెహెన్సివ్ రిస్క్ మేనేజ్ మెంట్ సివిల్ ప్రొటెక్షన్ ఏజన్సీ పేర్కొంది. ఇది టెరిబుల్ ట్రాజెడీ అని, మృతుల కుటుంబాలకు, క్షత గాత్రులకు సానుభూతి తెలుపుతున్నానని మేయర్ అన్నారు. ఓవర్ పాస్ హఠాత్తుగా కుప్పకూలడానికి కారణాలపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.  అటు-ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. 

మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …