AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Setup: టీవీ 9 ఎఫెక్ట్ః కోవిడ్ బాధితుల కష్టాలపై స్పందించిన టీటీడీ.. జర్మన్ షెడ్లతో మినీ కోవిడ్ సెంటర్ల ఏర్పాటు

టీవీ9 కథనాలకు టీటీడీ నుంచి స్పందన లభించింది. తిరుపతి స్విమ్స్ పద్మావతి కోవిడ్ సెంటర్ లో ఆక్సిజన్ బెడ్లు లేక ఆరుబయటే కుర్చీల్లో కూర్చోబెట్టి పేషెంట్లకు ఆక్సిజన్ అందిస్తున్న...

TTD Setup: టీవీ 9 ఎఫెక్ట్ః కోవిడ్ బాధితుల కష్టాలపై స్పందించిన టీటీడీ..  జర్మన్ షెడ్లతో మినీ కోవిడ్ సెంటర్ల ఏర్పాటు
Ttd Reacts To Covid Victims
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: May 04, 2021 | 2:52 PM

Share

టీవీ9 కథనాలకు టీటీడీ నుంచి స్పందన లభించింది. తిరుపతి స్విమ్స్ పద్మావతి కోవిడ్ సెంటర్ లో ఆక్సిజన్ బెడ్లు లేక ఆరుబయటే కుర్చీల్లో కూర్చోబెట్టి పేషెంట్లకు ఆక్సిజన్ అందిస్తున్న వైనంపై టీవీ9 ప్రసారం చేసిన కథనానికి టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించారు. అలాంటి పేషెంట్లు అందరికీ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా జర్మన్ షెడ్లు నిర్మించి మినీ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్సిజన్ బెడ్లు, ఏసీ, వాటర్ , మందులు , ఇంజెక్షన్లు అన్నీ అందిస్తున్నారు. పేషెంట్లు పెరిగెకొద్దీ షెడ్లను ఇంకా నిర్మిస్తామంటున్నారు

వాస్తవానికి నిన్నటి వరకూ ఈ పేషంట్లంతా ఆరుబయటే ఉండి చికిత్స పొందారు. కుర్చీల్లో కూర్చోబెట్టివారికి ఆక్సిజన్ పెట్టి బతికించారు. ఎండాకాలం కావడంతో పేషెంట్లు అల్లాడిపోతున్నారు. ఇదే అంశంపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు అందరూ జర్మన్ షెడ్లలోకి వెళ్లి చికిత్సపొందుతూ కోలుకుంటున్నారు. టీవీ 9 చూపిన చొరవకు కోవిడ్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆరుబయటే పేషెంట్లు ఆక్సిజన్ తీసుకుంటున్నారనే విషయాన్ని నాలుగురోజుల క్రితమే టీవీ9 టీమ్ వైవీసుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఆ రోజే ఆయన జర్మన్ షెడ్లు నిర్మిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అన్నట్టుగానే మూడురోజుల్లోనే షెడ్ నిర్మాణం పూర్తి చేసి పేషెంట్లను అందులోకి తరలించేశారు. అంతేకాదు త్వరలో మొబైల్ వాహనం ద్వారా కూడా ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇకపై ఇలాంటి జర్మన్ షెడ్లలో వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. 

సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.