AP Corona: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో 20వేలకు పైగా కేసులు..
Andhra Pradesh CoronaVirus Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో
Andhra Pradesh CoronaVirus Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో 20వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,15,784 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 82 మంది మరణించినట్లు వెల్లడించారు.
తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 11,84,028 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనాతో 8,289 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,59,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ మహమ్మారి నుంచి 10,16,142 మంది కోలుకున్నారు. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 17.3 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.41 శాతంగా ఉందని సింఘాల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 533 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 21,857 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే 20,017 నిండిపోయాయని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. 16,856 కాల్స్ 104 కాల్ సెంటర్‌కు వచ్చాయని, 9 లక్షలు వ్యాక్సిన్ డోసెస్ ఈనెల 15వ తేదీలోపు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఇదిలాఉంటే.. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రేపటి నుంచి ప్రభుత్వం ఆంక్షలు విధించనుంది. ఉదయం వేళ కూడా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టనున్నారు.
Also Read: