AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL POSTPONED: ఐపీఎల్ మ్యాచ్‌ల వాయిదాతో తీరని నష్టం.. బీసీసీఐకి లాస్ ఎంతంటే?

క్రికెటర్లతోపాటు జట్ల యాజమాన్యం, సపోర్టింగ్ సిబ్బందికి కరోనా సోకడంతో బీసీసీఐ ఆగమేఘాల మీద 14వ సీజన్ ఐపీఎల్ మ్యాచులను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. క్రికెటర్లు, ఫ్రాంచైజీలతోపాటు వివిధ వర్గాలకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ వాయిదా పడడంతో బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లనున్నది.

IPL POSTPONED: ఐపీఎల్ మ్యాచ్‌ల వాయిదాతో తీరని నష్టం.. బీసీసీఐకి లాస్ ఎంతంటే?
Ipl Matches And Corona Bcci
Rajesh Sharma
|

Updated on: May 04, 2021 | 7:49 PM

Share

IPL POSTPONED HUGE LOSE TO BCCI: ఒకటి రెండు రోజుల క్రితం ఆహ్లాదకరంగా క్రికెట్ ప్రియులను అలరించిన ఐపీఎల్ సీజన్ 14 (IPL SEASON 14) మ్యాచ్‌లు మంగళవారం ( మే 4వ తేదీన) సడన్‌గా వాయిదా పడ్డాయి. క్రికెటర్లతోపాటు జట్ల యాజమాన్యం, సపోర్టింగ్ సిబ్బందికి కరోనా సోకడంతో బీసీసీఐ (BCCI) ఆగమేఘాల మీద 14వ సీజన్ ఐపీఎల్ మ్యాచులను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ మొదటి వారంలో కరోనా వ్యాప్తిని, నియంత్రణ పరిస్థితిని సమీక్షించి.. తిరిగి మిగిలిన మ్యాచులను ఎప్పట్నించి నిర్వహించేది నిర్ణయిస్తారని తెలుస్తోంది. అయితే.. క్రికెటర్లు (CRICKETERS), ఫ్రాంచైజీలతోపాటు వివిధ వర్గాలకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ వాయిదా పడడంతో బీసీసీఐకి భారీగా నష్టం వాటిల్లనున్నది. ఈ లెక్కెంతో ఇపుడు చూద్దాం.

ఐపీఎల్‌ వాయిదాతో నష్టం ఎంత..? ఇపుడీ చర్చ క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. ఐపీఎల్ మ్యాచులను నిరవధికంగా వాయిదా వేయడంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలకు సుమారు అయిదున్నర వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంఛనా వేస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా ఐపీఎల్ మ్యాచులకు ఇన్సూరెన్స్ చేయించి వుంటే బీసీసీఐకి, ఫ్రాంచైజీలకు కాస్తైనా నష్టాలు తగ్గి వుండేవి. బీమా చేయించడం వల్ల ఏదైనా అనివార్య పరిస్థితిలో మ్యాచ్ రద్దైనా, వాయిదా పడినా బీమా మొత్తం బీసీసీఐకి, ఫ్రాంచైజీలకు అంది వుండేది. కరోనా సమయంలో పాండమిక్ (CORONA PANDEMIC) పరిస్థితిని కూడా కలుపుకుని ఇన్సూరెన్సు చేయించి వుంటే బీసీసీఐ, ఫ్రాంచైజీలకు వాటిల్లే నష్టంలో కొంతైనా పూడ్చుకునే పరిస్థితి వుండేది.

గత సంవత్సం జూన్ నెలలో కరోనా మొదటి వేవ్ (CORONA FIRST WAVE) తీవ్రంగా వున్న సమయంలో జరగాల్సిన వింబుల్డన్ టోర్నీ (WIMBLEDON TOURNEY)  రద్దు అవడంతో 90 శాతం నష్టాలను ఇన్సూరెన్సు డబ్బు ద్వారా తప్పించుకున్నారు వింబుల్డన్ నిర్వాహకులు. అదే తరహాలో ఐపీఎల్ మ్యాచులకు బీమా చేయించి వుంటే పరిస్థితి మరోలా వుండేది. కాకపోతే.. బీసీసీఐతో పాటు అనేక ఐపీఎల్ జ‌ట్లకు క‌రోనా మ‌హ‌మ్మారికి వ‌ర్తించే భీమా లేదని తెలుస్తోంది. ఈ మేరకు హోడెన్ అనే ప్రైవేట్ కంపెనీ తమ నివేదికలో పేర్కొంది. బీసీసీఐ సంప్ర‌దించే స‌మ‌యానికే త‌మ క‌వ‌రేజీ క్లాజ్ నుంచి క‌రోనా మ‌హ‌మ్మారిని కంపెనీలు తొలగించినట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి, మార్చి నాటికి కూడా త‌మ బీమా కంపెనీల‌ను బీసీసీఐ సహా ప్రాంఛైజీలు సంప్రదించలేదు. అదే సమయంలో బీమా నిబంధనలను కంపెనీలు మార్చేశాయి. ఇన్సూరెన్సు కింద డబ్బులు చెల్లించే అవసంర లేకుండా నిబంధనలు మార్చడంతో బీసీసీఐకి ఒక్కరూపాయి బీమా వర్తించదని బీమా కంపెనీలు స్పష్టం చేశాయి. దాంతో తాజా వాయిదా నిర్ణయంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలకు సుమారు అయిదున్నర వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ALSO READ: దేశంలో కరోనా విలయ తాండవం.. లోకల్ లాక్‌డౌన్లతో కట్టడికి ప్రభుత్వాల యత్నం