‘మీకన్నా ఐఐటీ సంస్థ నయం,’ ఆక్సిజన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు నిప్పులు

ఆక్సిజన్ సరఫరాపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై మళ్ళీ నిప్పులు చెరిగింది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరలేదని, ఈ ప్రాణవాయువు పంపిణీలో మీకన్నా ఐఐటీలు, ఐఐఎంఎస్ సంస్థలు బాగా పని చేస్తాయని పేర్కొంది...

'మీకన్నా ఐఐటీ సంస్థ నయం,' ఆక్సిజన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు నిప్పులు
Delhi Highcourt Pulls Centre On Oxygen Supply
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 04, 2021 | 8:44 PM

ఆక్సిజన్ సరఫరాపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై మళ్ళీ నిప్పులు చెరిగింది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరలేదని, ఈ ప్రాణవాయువు పంపిణీలో మీకన్నా ఐఐటీలు, ఐఐఎంఎస్ సంస్థలు బాగా పని చేస్తాయని పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఆర్మీని రంగంలోకి దించడానికి మీ ప్లాన్స్ ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్ సరఫరా విషయంలో ఢిల్లీ ప్రభుత్వం సమర్పించిన లెక్కలు, ఇచ్చిన సమాచారం తమకు  పరిస్థితిని పూర్తిగా తెలియజేసిందని, మీరు ఆక్సిజన్ పంపిణీని ఐఐటీకి గానీ, ఐఐఎంఎస్ కి  గానీ అప్పగిస్తే బాగుంటుందని, ఆ  సంస్థలే బాగా నిర్వహిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని సుప్రీంకోర్టు చెప్పిందని, దీన్ని సమకూర్చే బాధ్యత మీదేనని వారన్నారు. తాము ఈ నగరానికి 433 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని సోమవారం రాత్రే ఇచ్చామని కేంద్రం చెప్పగా, ఇది ఏమూలకూ చాలదని ప్రభుత్వ తరఫు లాయర్ అన్నారు. 420 మెట్రిక్ టన్నులు ఇచ్చినా రోగులు మరణిస్తున్నారనిఆయన చెప్పారు. కానీ ఇది మరీ విడ్డూరంగా ఉందని, వ్యవస్థను ప్రభావితం చేయడమేనని కేంద్రం వ్యాఖ్యానించగా.. కోర్టు మండిపడింది. మీ వ్యాఖ్య చాలా దురదృష్టకరమని, అసలు ఇలా ఎలా అంటారని న్యాయమూర్తులు అన్నారు. సైన్యం సహాయాన్నిమీరు తీసుకోవలసిందే..తీసుకోకపోతే కారణాలు చెప్పండి.. మీ నిస్సహాయత ఏమిటి అని వారు ప్రశ్నించారు.

ఇందుకు మరేదైనా కారణాలు ఉన్నాయా అని కూడా ప్రశ్నించారు. అయితే దీనిపై ఉన్నత స్థాయి పరిశీలన జరుగుతోందని కేంద్రం చెప్పగా .. ఆర్మీ సాయం తీసుకోవాలని తాము సూచించి 48 గంటలు గడిచిపోయాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా వెంటనే తగిన చర్య తీసుకుని ఢిల్లీ ఆసుపత్రులకు వెంటనే ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తారని తాము ఊహించలేదని దాదాపు చీవాట్లు పెట్టింది. గతంలో కూడా హైకోర్టు ఇలా కేంద్రంపై నిప్పులు చెరిగింది. మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.

సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు