AP Government: ఇళ్లు లేని నిరుపేదలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. నిర్మాణం వేగవంతం
ఏపీ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ వినిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియ...
ఏపీ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ వినిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో వడివడిగా ఇళ్ల నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. అందరికీ ఇళ్లు పథకం కింద ప్రభుత్వం రికార్డుస్థాయిలో దాదాపు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. శ్రీకాకుశం జిల్లాలో మొదటి దశలో 92వేలు, విజయనగరంలో 98వేలు, విశాఖలో 52వేలు ఇళ్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అలాగే తూర్పు గోదావరి 1లక్షా48వేలు, పశ్చిమ గోదావరి 1లక్షా70వేలు, కృష్ణా 1లక్షా67వేలు, గుంటూరు 1లక్షా 63వేలు, ప్రకాశం 84వేలు ఇళ్లు నిర్మించనున్నది. నెల్లూరు 53వేలు, చిత్తూరు 1లక్షా74వేలు, కడప 95వేలు కర్నూలు 98వేలు, అనంతపురం 1లక్షా11వేలు ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకోసం ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియను ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు సిమెంట్, ఇనుము, ఇతర ముడిసరుకు సరఫరా చేసేవారికి సకాలంలో బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతివారం లబ్ధిదారులు, సరఫరాదారులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని జమ చేస్తారు. దీంతో అన్ని జిల్లాల్లో గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు.
మొదటి దశలో మంజూరైన 15లక్షల10వేల227 ఇళ్లకు సంబంధించి 12లక్షల61వేల928 ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తి చేశారు. దాదాపు 84% ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తయ్యింది. మిగిలింది ఈ నెల 15లోగా పూర్తి చేయనున్నారు. ఇక 7లక్షల81వేల430 ఇళ్ల స్థలాలకు అంటే దాదాపు 52% జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. మిగతాదీ గడువులోగా పూర్తి చేయనున్నారు.
Also Read: ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ
కరోనా కల్లోలం.. పాలకుర్తి ఆలయంలోకి భక్తులకు నిరాకరణ.. ఎప్పటివరకు అంటే..
కరోనా దెబ్బకు ఖాళీ అయిన గ్రామం.. ఒకే ఊరిలో 600 మందికి కరోనా పాజిటివ్.. చెట్ల కిందే కాపురం
ఆ రోజున రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సొమ్ము.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..