AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: కరోనా దెబ్బకు ఖాళీ అయిన గ్రామం.. ఒకే ఊరిలో 600 మందికి కరోనా పాజిటివ్.. చెట్ల కిందే కాపురం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి వైరస్ సోకిందంటే చాలు ఏకాంత జీవితం గడపాల్సిందే. ఇంట్లో ఒకరిద్దరికి వస్తే తల్లడిల్లిపోతాం.

Covid 19: కరోనా దెబ్బకు ఖాళీ అయిన గ్రామం..  ఒకే ఊరిలో 600 మందికి కరోనా పాజిటివ్.. చెట్ల కిందే కాపురం
Coronavirus Positive For 600 People
Balaraju Goud
| Edited By: Team Veegam|

Updated on: May 04, 2021 | 7:12 PM

Share

Corona in Village: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి వైరస్ సోకిందంటే చాలు ఏకాంత జీవితం గడపాల్సిందే. ఇంట్లో ఒకరిద్దరికి వస్తే తల్లడిల్లిపోతాం. అలాంటిది కరోనా వైరస్ కారణంగా ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. నిత్యం మనుషుల తాకిడితో కళకళలాడే వీధులన్నీ బోసిపోయాయి. పిల్లల ఆట పాటలతో ఎంతో సందడిగా ఉండే ఆ గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కేవలం వృద్దులు మాత్రమే ఆ ఊర్లో కనిపిస్తున్నారు. ఊర్లో ఉన్నవారంతా చెట్టు, పుట్టా పట్టుకుని పొలాల వైపు తలదాచుకుంటున్నారు. జనం పెద్ద పెద్ద ఇళ్లను వదిలేసి పొలం గట్లపై బావుల దగ్గర చిన్న చిన్న గుడిసెల్లో నివాసముంటున్నారు. వైరస్ ఊళ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో .. ఊరి జనం ఊరిబయటకు తరలిపోయారు.

అదీ వికారాబాద్ మండలం ఎర్రవల్లి దయనీయస్థితి. కరోనా విజృంభణతో ఊరంతా చెల్లాచెదురైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోన్న కరోనా, అక్కడ సగం ఊరు ఐసోలేషన్ లో ఉండేలా చేసింది. ఆ ఊరి జనాభా 1400 మందిగా ఉంటే.. వారిలో సుమారు 600 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో గ్రామంలో జనం పిల్లాజెల్లా ఇలా ఊరి పొలిమేరల్లో కాపురం చేస్తున్నారు. ఇదే క్రమంలో శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడి వారం క్రితం ఇద్దరు మృతి చెందారు. జనమంతా వెళ్లిపోయి తమ వ్యవసాయ పొలాల వద్ద గుడిసెలు వేసుకొని క్వారంటైన్‌లో గడుపుతున్నారు. అధికారులు తమ గోడు వినిపించుకోవడం లేదని వాపోతున్నారు.

గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేసి అందరికీ టెస్టులు చేయాలని ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఏఎన్‌ఎం మాత్రం గ్రామానికి వచ్చి వెళ్తోందని చెబుతున్నారు. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో స్థానిక నేత ఒకరు జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి మృతదేహాలను పూడుస్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఊరి మీదపడి దోచుకుపోయినా అడిగే నాథుడులేడని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిపై ఎమ్మెల్యే ఆనంద్‌కు కూడా సమాచారం ఇచ్చాం. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఊరు విడిచి పొలాల్లో ఉంటున్నాం. అధికారులు ప్రజాప్రతినిధులేమో పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఎప్పుడు ఎవరు చనిపోతారోనని భయంతో బిక్కుబిక్కుమంలూ కాలం వెల్లదీస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరా.. మా బతుకు ఇంతేనా చావాల్సిందేనా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

Read Also…. Corona News: కరోనా టెస్టులు కోసం జనాలు పడిగాపులు..క్యూలైన్‌లో చెప్పులు..!

ఆ రోజున రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సొమ్ము.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

 ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ

కరోనా క‌ల్లోలం.. పాలకుర్తి ఆలయంలోకి భక్తులకు నిరాకరణ.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే..