AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బాధితులకు అండగా టాలీవుడ్ తారలు.. 300 మంది కోవిడ్ రోగుల దాహాన్ని తీర్చిన అడివి శేష్..

Adivi Sesh: కరోనా సెకండ్ వేవ్ దేశంలో తన ఉదృతిని కొనసాగిస్తోంది. దీంతో రోజు రోజుకీ కోవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే

కరోనా బాధితులకు అండగా టాలీవుడ్ తారలు.. 300 మంది కోవిడ్ రోగుల దాహాన్ని తీర్చిన అడివి శేష్..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: May 04, 2021 | 5:12 PM

Share

Adivi Sesh: కరోనా సెకండ్ వేవ్ దేశంలో తన ఉదృతిని కొనసాగిస్తోంది. దీంతో రోజు రోజుకీ కోవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సోషల్ మీడియాలో కరోనా బాధితుల అవస్థలకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుండా నటీనటులు కరోనా రోగులకు సహయానికి ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కరోనా బాధితులను అందుకోవడానికి ముందుకు వచ్చాడు. దాదాపు 300 మంది కరోనా రోగుల దాహార్తిని తీర్చాడు.

హైదరాబాద్‏లోని కోఠీ ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 300 కోవిడ్ పేషెంట్స్ చికిత్స చేయించుకుంటున్నారు. అయితే అక్కడ తాగునీటికి ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ విషయం అడివి శేష్ దృష్టికి చేరింది. కరోనా బాధితులతోపాటు అక్కడి వైద్య సిబ్బంది కూడా నీటి సమస్యతో డీహైడ్రేషన్ కు గురౌతున్నారనే విషయం తెలుసుకున్న అడివి శేష్ వెంటనే 850 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు. అలాగే ఆ ఆసుపత్రికి అవసరాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసేందుకు శాశ్వత ప్రణాళికకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. సమయానికి కరోనా బాధితులను ఆదుకున్న అడివి శేష్ ను అక్కడి వారు అభినందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే సినీ కార్మికులకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు గతంలో చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: “శాకిని- ఢాకిని” గా నివేదా రెజీనా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వకీల్ సాబ్ బ్యూటీ కొత్త సినిమా..

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..

Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్