AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..

కోవిడ్ సెకండ్ వేవ్ స్మశానాలను రద్దీగా మార్చేసింది. ఎంతలా అంటే స్మశానాలకు హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేంతలా. రోజుకీ వందల సంఖ్యలో ఈ మహమ్మరి

Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..
Nikki Thamboli
Rajitha Chanti
|

Updated on: May 04, 2021 | 3:47 PM

Share

కోవిడ్ సెకండ్ వేవ్ స్మశానాలను రద్దీగా మార్చేసింది. ఎంతలా అంటే స్మశానాలకు హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేంతలా. రోజుకీ వందల సంఖ్యలో ఈ మహమ్మరి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనాకు బలియ్యారు. తాజాగా హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్.. హీరోయిన్ నిక్కితంబోలి సోదరుడు కరోనా కాటుకు బలయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‏స్టాగ్రామ్‏లో ఎమోషనల్ ట్వీట్ చేసింది. తన సోదరుడు చాలా కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. ఇటీవల అతడికి కరోనా సోకిందని.. మంగళవారం ఉదయం అతను తుది శ్వాస విడిచాడని నిక్కి తంబోలి తన ఇన్ స్టా వేదికగా తెలిపింది.

“ఈరోజు ఉదయం ఆ దేవుడు నీ పేరు పిలవబోతున్నాడని మాకు తెలియదు. జీవితంలో మేము నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాము. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళలేదు. మాలో సగభాగాన్ని నీతో తీసుకెళ్ళావు. నువ్వు మాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చావు. నీ ప్రేమ ఎప్పటికీ మాతోనే ఉంటుంది. మేము నిన్ను చూడలేకపోవచ్చు కానీ ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు. మా కుటుంబ దారం తెగిపోయింది. నువ్వు వెళ్ళేముందు మాకు వీడ్కోలు చెప్పలేదు. నీకంటూ తెలియక ముందే నువ్వు వెళ్ళిపోయావు. నీన్ను రక్షిస్తుంది అంటే కొన్ని మిలియన్ టైమ్స్, ఎడవడానికి సిద్ధంగా ఉన్నాము.” అంటూ భావోద్వేగ ట్వీట్ చేసింది నిక్కి తంబోలి.

ఇదిలా ఉంటే.. తన సోదరుడి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని నిక్కి తెలిపింది. అతనికి కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. 20 రోజుల క్రితం అతనికి ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చిందని.. దీంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చామని తెలిపింది. ఇక ఆ సమయంలో నిర్వహించిన పరీక్షలలో అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అలాగే అతనికి క్షయ వ్యాధి, న్యుమోనియా వ్యాధి కూడా ఉన్నట్లు తెలిపింది. దేవుడు నా సోదరుడిని చాలా సార్లు రక్షించాడు. కానీ విధి చేతిలో అతడు ఒడిపోయాడు. నా సోదరుడి కోసం ప్రార్ధించినావారికి ధన్యవాదలు.. కానీ అతడు ఆసుపత్రిలో విసిగిపోయాడు. ప్రస్తుతం అతను మంచి ప్రదేశంలో.. మంచి వ్యక్తి చేతుల్లోకి వెళ్లాడు అంటూ ట్వీట్ చేసింది నిక్కి తంబోలి.

ట్వీట్..

Also Read:  Adipurush Movie: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్.. కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్..

యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ సర్కారు వారి పాట… సినిమాలో భారీ ఛేజింగ్ సీక్వెన్స్ ఉండనుందట ..