సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..

కరోనా సెకండ్ వేవ్ దేశంలో మారణ మృదంగం మోగిస్తోంది. ఒక్కరోజులో 3 లక్షల కేసులు నమోదవడం.. వేల సంఖ్యలో ప్రాణాలు పోవడం చూస్తుంటే

  • Rajitha Chanti
  • Publish Date - 3:16 pm, Tue, 4 May 21
సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..
Pia Bajpee

కరోనా సెకండ్ వేవ్ దేశంలో మారణ మృదంగం మోగిస్తోంది. ఒక్కరోజులో 3 లక్షల కేసులు నమోదవడం.. వేల సంఖ్యలో ప్రాణాలు పోవడం చూస్తుంటే దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రోగులకు మందులు, వెంటిలేటర్లు, బెడ్స్, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ మహమ్మారి ప్రభావం సినీ పరిశ్రమ మీద కూడా తీవ్రంగానే ఉంది. ఇప్పటికే కరోనా బారిన పడి పలువురు సినీ ప్రముఖులు, దర్శకనిర్మాతలు మరణించారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ పియా బాజ్ పాయ్ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు కరోనాతో మంగళవారం ఉదయం కన్నుమూశారు.

ఉత్తర ప్రదేశ్‏లోని ఫరూఖాబాద్ జిల్లాలో తన సోదరుడికి కరోనా సోకి పరిస్థితి ఆందోళకరంగా ఉందని.. వెంటిలేటర్, బెడ్ కావాలని కోరుతూ పియా ట్వీట్ చేసిన కొన్ని గంటలకే అతడు మృతి చెందాడు. తన సోదరుడిని కాపాడుకోవడం కోసం ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయిందని.. వెంటిలేటర్ సపోర్ట్ లేకపోవడంతో తన సోదరుడు కరోనాకు బలైపోయాడంటూ పియా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన కళ్ళముందే అతని ప్రాణాలు పోవడం చూసి తట్టుకోలేపోతున్నానుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Anitha

మరోవైపు టాలీవుడ్‏లో ఈ మహమ్మారి పంజా విసురుతోంది. అయితే కేవలం కరోనాతో మాత్రమే కాకుండా… ఇతర అనారోగ్య సమస్యలతో పలువురు సినీ ప్రముఖులు మరణిస్తున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతిమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుముశారు. ఈమె కూడా లు చిత్రాల‌కు నిర్మాత‌గా వ్యవహ‌రించారు. వెంక‌టేశ్వ‌ర‌రావు- అనితల కుమార్తె స్వాతి గ‌తంలో జ‌నియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన రామాయ‌ణం మూవీలో రావ‌ణుడిగా న‌టించి అల‌రించింది. అయితే అనిత అకాల మ‌ర‌ణంపై సినీ ప‌రిశ్రమకు చెందిన ప‌లువురు ప్రముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

పియా బాజ్ పాయ్ ట్వీట్..

Also Read: Adipurush Movie: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్.. కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్..

మహేశ్.. త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్.. మరోసారి సూపర్ స్టార్‏కు జోడీగా ఆ హీరోయిన్ ?