“శాకిని- ఢాకిని” గా నివేదా రెజీనా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వకీల్ సాబ్ బ్యూటీ కొత్త సినిమా..

Nivetha Thomas Ana Regina Cassandra: రీసెంట్‏గా రిలీజైన వకీల్ సాబ్‌ సినిమాలోని తన ఫెర్ఫామెన్స్‏తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది నివేదా థామస్‌.

  • Rajitha Chanti
  • Publish Date - 4:37 pm, Tue, 4 May 21
"శాకిని- ఢాకిని" గా నివేదా రెజీనా... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వకీల్ సాబ్ బ్యూటీ కొత్త సినిమా..
Nivetha Regina

Nivetha Thomas Ana Regina Cassandra: రీసెంట్‏గా రిలీజైన వకీల్ సాబ్‌ సినిమాలోని తన ఫెర్ఫామెన్స్‏తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది నివేదా థామస్‌. తాజాగా ఈ అమ్మడు ఓ కొరియన్‌ రిమేక్‌తో మన ముందుకు రాబోతోంది. అయితే ఈ అమ్మాయి ఒక్కతే కాదు.. జంటగా రెజీనా కసాండ్రాను కూడా తీసుకువస్తోంది. ఇంతకీ ఆ సినిమా డిటేల్స్‌ ఏంటో తెలుసుకోవాలనుకుందమా..  నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుధీర్‌ వర్మ ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ చిత్రాన్ని రిమేక్‌ చేస్తున్నాడు. మాతృక అయిన కొరియన్ డ్రామాలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే ఈ తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయిస్తూ దర్శకుడు ఉమెన్ సెంట్రిక్ మూవీగా దీనిని మార్చాడు. అయితే ఇటీవలే చిత్రీకరణ పూర్తి అయిన ఈ చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఊహించని విధంగా ఉమెన్ ట్రాఫికర్స్ గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. మానవ రవాణా ముఠా నుండీ తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వారిని ఎలా  రక్షించారన్నదే ఈ చిత్ర కథ. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఈ ఇద్దరు హీరోయిన్‌ల క్యారెక్టర్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అతి తొందర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

Also Read: Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..

Adipurush Movie: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్.. కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్..