Chandrababu: చంద్రబాబు ఆస్తుల కేసు.. లక్ష్మీపార్వతికి చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల విషయంలో ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి వేసిన కేసులో ఆమెకు షాక్ తగిలింది. ఆ కేసును కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Chandrababu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల విషయంలో ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి వేసిన కేసులో ఆమెకు షాక్ తగిలింది. ఆ కేసును కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. 2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తుల లెక్కల ఆధారంగా లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. 1987 నుంచి 2005 మధ్యలో చంద్రబాబు ఆస్తులు విపరీతంగా పెరిగాయనీ, ఈ ఆస్తుల విషయంలో విచారణ జరపాలనీ లక్ష్మీపార్వతి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై 2005లో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు పెండింగ్ లో ఉన్న స్టేలు ఎత్తివేయాలని తీర్పు వెల్లడించింది. దీంతో చంద్రబాబుపై అప్పుడు లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేయాలని నిర్ణయించింది. తాజాగా, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది.
చంద్రబాబును జైలుకు పంపించడమే తన జీవితాశయం అని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి పలుమార్లు చెపుతూ వస్తున్నారు. దశాబ్దాలుగా లక్ష్మీపార్వతి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అప్పట్లో ఆమె చంద్రబాబు మీద ఎన్నో ఆరోపణలు చేశారు. చాలా వాటిలో ప్రాధమిక ఆధారాలు లేవని కోర్టు కేసులు కొట్టివేసింది. కొన్ని కేసుల్లో చంద్రబాబుకు అనుకూలంగా స్టే ఇచ్చింది. దీంతో లక్ష్మీపార్వతికి ఈ కేసు విషయంలో చుక్కెదురైంది.
Keerthy Suresh: జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ తొలి సంపాదన రూ. 500.. ఆ డబ్బు ఎవరికిచ్చారంటే..