అనంతపురం జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు.. 50 బత్తాయి చెట్లను నరికివేసిన ప్రత్యర్థులు

అనంతపురం జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పచ్చని చెట్లు నరికివేసే సంస్కృతి.....

  • Ram Naramaneni
  • Publish Date - 7:08 am, Tue, 4 May 21
అనంతపురం జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు.. 50 బత్తాయి చెట్లను నరికివేసిన ప్రత్యర్థులు
Crop Demolished

అనంతపురం జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. జిల్లాలో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పచ్చని చెట్లు నరికివేసే సంస్కృతి ఇంకా వీడటం లేదు. తాజాగా జిల్లాలోని పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు 50 బత్తాయి చెట్లను నరికివేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయ‌కుడు నారాయణరెడ్డికి చెందిన 50 చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరన్నది తెలియరాలేదు. బాధితుడికి స్థానికంగా వైసీపీ నాయకులతో వైరం ఉందని.. అందుకే చెట్లు నరికి వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై బాధితుడు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ప్రత్యర్థులకు ఆర్థికంగా నష్టం కలిగించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడటం అనంతపురం జిల్లాలో సర్వసాధారణమే అంటున్నారు అక్కడి స్థానికులు. పంటలు ధ్వంసం చేయడం, వాహనాలు తగులబెట్టడం వంటి చర్యలకు పాల్ప‌డుతుంటార‌ని చెబుతున్నారు. కాపుకొచ్చిన పచ్చని బత్తాయి చెట్లను నరికివేయడం చూసేవారిని కలిచి వేస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Also Read:మే, జూన్‌ నెలల్లో ఉచిత రేషన్ సరుకులు..! మీ రేషన్ డీలర్ నిరాకరిస్తే ఇక్కడ ఫిర్యాదు చేయండి..? తెలుసుకోండి..

 విడాకులు తీసుకోనున్న బిల్‌గేట్స్‌ దంపతులు.. తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతున్నట్టు సంచలన ట్వీట్!