Road Accident: కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం..
Guntur Road Accident: గుంటూరు జిల్లాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో
Guntur Road Accident: గుంటూరు జిల్లాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. గుంటూర్ జిల్లా దుగ్గిరాల సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బస్సు అతివేగంగా ఢీకొట్టంతో కారు నుజ్జునుజ్జై మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కు పోయాయి. స్థానికులు అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. పలువురి నుంచి వివరాలు సేకరించారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: