Mamata Banerjee: మమత పోటీ చేసేది అక్కడ్నించే.. తృణమూల్ సీటు నుంచే బరిలోకి దీదీ

ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ఇంటర్ ఫెయిలైనట్లు అయ్యింది బెంగాల్ సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీకి. ముచ్చటగా మూడోసారి.. అది కూడా గత రెండుమార్లకు మించిన సీట్లతో అధికారం చేపట్టబోతున్న బెంగాల్ దీదీ మమతా బెనర్జీకి తాజా...

Mamata Banerjee: మమత పోటీ చేసేది అక్కడ్నించే.. తృణమూల్ సీటు నుంచే బరిలోకి దీదీ
Mamata Banerjee.
Follow us
Rajesh Sharma

|

Updated on: May 03, 2021 | 7:15 PM

Mamata Banerjee to contest from Khardaha: ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ఇంటర్ ఫెయిలైనట్లు అయ్యింది బెంగాల్ సిట్టింగ్ సీఎం (BENGAL SITTING CM) మమతా బెనర్జీ (MAMATA BANERJEE)కి. ముచ్చటగా మూడోసారి.. అది కూడా గత రెండుమార్లకు మించిన సీట్లతో అధికారం చేపట్టబోతున్న బెంగాల్ దీదీ మమతా బెనర్జీకి తాజా విజయాన్ని పెద్ద ఎత్తున సంబరం చేసుకోకుండా అడ్డు పడింది నందిగ్రామ్‌ (NANDIGRAM)లో తన ఓటమి. పైకి ఎలెక్షన్ కమిషన్‌ (ELECTION COMMISSION) అక్రమాలకు పాల్పడిందని ఆరోపించవచ్చు గానీ.. దీదీ మనసులో మాత్రం ఈలోటు పూడ్చలేనిదిగానే చెప్పుకోవాలి. చిన్న గాయానికి 40 రోజుల పాటు కాలికి కట్టు కట్టుకుని, వీల్ చైర్‌లో ప్రచారం చేసి సెంటిమెంటును క్యాష్ చేసుకున్న మమతా బెనర్జీ.. ఫలితాలకు ఒక్క రోజు ముందు కాలికి కట్టు తీసేసి.. ఫుట్ బాల్ పట్టుకుని ఆడుతూ కనిపించారంటే తన గాయంతో బెంగాలీయుల్లో సెంటిమెంటుకు ఎంతగా ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో మరోసారి సెంటిమెంటు రాజేయడం ద్వారా తనకు తాజా ఫలితాల్లో లోటుగా మిగిలిన దాన్ని సరిచేసుకునేందుకు మమతా బెనర్జీ సిద్దమవుతున్నారు.

294 సీట్లకు గాను 213 సీట్లను గెలుచుకుని బంపర్ మెజారిటీతో బెంగాల్ సీఎం సీటును మూడో సారి ఎక్కబోతున్నారు మమతా బెనర్జీ. తాను పెట్టిన పార్టీ.. ఎదురుగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేని నేతలు.. వెరసి ఎమ్మెల్యేగా తాను ఓడినా మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకునే శక్తే లేదిపుడు. దాంతో మే 5వ తేదీన మమతా సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ఖరారైనట్లు ప్రకటన కూడా వెల్లడైంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలలలోపు మమత శాసనసభలో సభ్యురాలిగా రావాల్సి వుంటుంది. ఈ క్రమంలో మమత ఎక్కడ్నించి శాసనసభకు పోటీ చేస్తారన్నది ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అయితే.. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన మూడు చోట్ల గెలిచిన అభ్యర్థులు ఇదివరకు పరమపదించారు. దాంతో మమతకు ఎవరితో రాజీనామా చేయించకుండానే అసెంబ్లీకి ఎన్నికయ్యే అవకాశం వుంది.

మే రెండో తేదీన ఫలితాలు వెలువడిన 294 సీట్లలోను మూడు చోట్ల అభ్యర్థులు కరోనాతో మరణించారు. జంగీపూర్‌ (JANGEEPUR)లో ఆర్ఎస్పీ (RSP) అభ్యర్థి, శంషేర్ గంజ్‌ (SHAMSHAIR GUNJ)లో కాంగ్రెస్ అభ్యర్థి (CONGRESS CANDIDATE), ఖర్దాహా (KHARDAHA)లో టీఎంసీ (TMC) అభ్యర్థి మరణం పాలయ్యారు. అయితే.. బీజేపీ (BJP)ని నిలువరించే క్రమంలో మమతా బెనర్జీ కాంగ్రెస్, ఆర్ఎస్పీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం వుంది. అందుకే చివరికి నాలుగు విడతల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రచారం చేయలేదు. దాంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు పోలరైజ్ అయ్యి టీఎంసీ ఘన విజయానికి దారి తీసింది. ఓరకంగా చెప్పాలంటే కాంగ్రెస్, వామపక్షాలు (LEFT PARTIES) తమ అస్తిత్వం పూర్తిగా నేలమట్టమైనా ఫరవాలేదు బీజేపీ మాత్రం బెంగాల్ గద్దెనెక్కకూడదన్నట్లుగా వ్యవహరించాయి చివరి నాలుగు విడతల ప్రచారంలో. ఈ క్రమంలో కాంగ్రెస్, ఆర్ఎస్పీ అభ్యర్థులు గెలిచిన చోట్ల నుంచి మమతా బెనర్జీ పోటీకి దిగకుండా వారి పట్ల కృతఙ్ఞతగా వ్యవహరించవచ్చని అంటున్నారు.

కాగా మిగిలిన ఖర్దాహా నుంచి తమ పార్టీకి చెందిన కాజల్ సిన్హా (KAJAL SINHA) గెలుపొందారు. ఏప్రిల్ 22న ఖర్దాహా పోలింగ్ జరగ్గా ఆ మర్నాడే కాజల్ సిన్హా కరోనా (CORONA) బారిన పడ్డారు. ఆ తర్వాత నాలుగురోజులకు చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆ తర్వాత మే రెండో తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో కాజల్ సిన్హా తన సమీప బీజేపీ అభ్యర్థి శిల్ భద్ర దత్తా (SILBHADRA DUTTA)పై 28 వేల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తర 24 పరగణాల జిల్లా (NORTH 24 PARAGANAS DISTRICT)లో డమ్ డమ్ (DUM DUM) లోక్‌సభ సీటు పరిధిలో వున్న ఖర్దాహా నియోజకవర్గంలో టీఎంసీ 49 శాతం ఓట్లను సాధించింది. అత్యధిక ఓట్ల శాతం రావడంతోపాటు తమకే చెందిన విజేత మరణించడంతో మరో ఆలోచన లేకుండా ఖర్దాహా నుంచి పోటీ చేసేందుకు మమతా బెనర్జీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ALSO READ: ఇక రంగంలోకి చిన్నమ్మ… అన్నా డిఎంకే సారథ్యానికి పావులు కదుపుతున్న శశికళ?

ALSO READ: బెంగాల్ ఎన్నికల విశ్లేషణలో ఆసక్తికర అంశాలెన్నో… తృణమూల్ విజయం వెనుక మర్మమిదే?

ALSO READ: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు

ALSO READ: ఐపీఎల్‌కు కరోనా షాక్… ప్రస్తుత సీజన్‌ను వాయిదా వేసే యోచనలో యాజమాన్యం!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!