IPL Postpone: ఐపీఎల్‌కు కరోనా షాక్… ప్రస్తుత సీజన్‌ను వాయిదా వేసే యోచనలో యాజమాన్యం!
నిరుడు ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్‌లో జరిగింది. కానీ ఈసారి (2021) ఐపీఎల్ సీజన్‌ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం... పలు జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి.. ఆడియెన్స్...

IPL Postponement possible due to corona: నిరుడు ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్‌లో జరిగింది. కానీ ఈసారి (2021) ఐపీఎల్ సీజన్‌ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం (IPL MANAGEMENT)… పలు జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి.. ఆడియెన్స్ (ప్రేక్షకులు)లేకుండానే మ్యాచులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన 14వ సీజన్ ఐపీఎల్ (14TH SEASON IPL TOURNEY) సజావుగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ (SECOND WAVE CORONA VIRUS) విరుచుకుపడింది. ప్రతీ రోజులు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మే 1వ తేదీన అయితే రికార్డు స్థాయిలో ఏకంగా 4 లక్షల 6 వేల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మరోవైపు కరోనా మరణాలు (CORONA DEATHS) కూడా పెరిగిపోతున్నాయి. వైరస్ సోకిన వారికి ఆక్సిజన్ (OXYGEN) అందక చనిపోతుంటే ప్రభుత్వాలు చేతలుడిగి చూస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి మెల్లిగా ఐపీఎల్ మ్యాచులపై (IPL MATCHES) కూడా పడడడం ప్రారంభమైంది. ఒకరిద్దరు ఆటగాళ్ళు వైరస్ బారిన పడడంతో మే 3వ తేదీన జరిగాల్సిన బెంగళూరు (BANGALORE), కోల్‌కతా (KOLKATA) మ్యాచును వాయిదా వేశారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ పూర్తిగా వాయిదా పడే అవకాశాలున్నాయంటూ కథనాలు మొదలయ్యాయి.
నిజానికి గత కొన్ని రోజులుగా 14వ సీజన్ ఐపీఎల్‌ను రద్దు చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ అవరసరమా అనే వాదన తెరపైకి వచ్చింది. ఐపీఎల్ ద్వారా ఎంటైర్‌టైన్‌మెంట్ లభిస్తున్నా ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీని రద్దు చేస్తేనే మంచిదని పలువురు అంటున్నారు. ఐపీఎల్‌లో పాల్గొంటున్న పలువురు క్రికెటర్లు (CRICKETERS) కూడా ఇదేరకంగా ఫీలవుతున్నా.. బయటికి మాత్రం ఒకరిద్దరికి మించి మాట్లాడడం లేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు ఆండ్రూ టై మాత్రం ఐపీఎల్‌ను రద్దు చేస్తేనే బెటరంటూ తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా వెల్లడించాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తాను ఆడలేనని ప్రకటించి టోర్నీకి గుడ్ బై చెప్పాడు. అదే సమయంలో కరోనా వైరస్‌తో భారత్ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంటే వేల కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్‌ను నిర్వహించడం అవసరమా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ద్వారా ఎంతటి వినోదాన్ని పంచినా దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్య ముందు అది అవసరం లేదని తేల్చిచెప్పాడు.
ఒకవైపు ఐపీఎల్ ఆడే క్రికెటర్లు సుదీర్ఘ బయోబబుల్ (BIO-BUBBLE) ఉండాల్సి రావడంతో పలువురు క్రికెటర్లు ఈ టోర్నీని వీడారు. ఇది తమవల్ల కాదంటూ ఆడమ్ జంపా, రిచర్డ్‌సన్, ఆండ్రూ టై, లివింగ్‌స్టోన్ తదితరులు తమ దేశాలకు వెళ్లిపోయారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ (RAVICHANDRAN ASHWIN) కూడా తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DELHI CAPITALS)ను వీడాడు. అశ్విన్ కుటుంబంలో తల్లిదండ్రులకు కరోనా రావడంతో అతను ఉన్నపళంగా టోర్నీని వదిలేశాడు. కాగా కరోనా సెగ అంపైర్లు (UMPIRES), మ్యాచ్ రిఫరీలకు కూడా తాకింది. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్ (NITIN MENON) కూడా ఇంటికి వెళ్లిపోయారు. మీనన్ తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉండటం కోసం మీనన్ టోర్నీ నుంచి వైదొలిగారు. ఆస్ట్రేలియా (AUSTRALIA)కు చెందిన అంపైర్ పాల్ రీఫెల్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి యత్నించారు. కాగా, అప్పటికి విమాన రాకపోకల నిషేధం అమల్లోకి రావడంతో రిఫెల్ వెళ్లలేకపోయారు.
ఐపీఎల్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న మను నయ్యర్ బయో బబుల్‌ను వీడి స్వస్థలం న్యూఢిల్లీ (NEW DELHI)కి వెళ్లిపోయారు. ఆయన తల్లి హఠాన్మరణమే అందుకు కారణం. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మను నయ్యర్ మళ్లీ టోర్నీకి తిరిగి వస్తారా అన్న అంశంపై స్పష్టత లేదు. తాజాగా కోల్‌కతా జట్టు (KOLKATA TEAM) ఐసోలేషన్ (ISOLATION)లోకి వెళ్లిపోయింది. ఆ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో కేకేఆర్ ఐసోలేషన్‌లోకి వెళ్లకతప్పలేదు. అదే సమయంలో మే3వ తేదీన ఆర్సీబీ-కేకేఆర్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా భయంభయంగానే ఈ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికి సగం మ్యాచ్‌లు మాత్రమే పూర్తి కాగా, ఇంకా దాదాపు సగం టోర్నీ మిగిలి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే వాదన మరోసారి ఊపందుకుంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CHENNAI SUPER KINGS) జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ (LAXMIPATI BALAJI)లకు కూడా కరోనా సోకింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ను రద్దు చేసినా.. వాయిదా వేసిన ఉపయోగం ఏంటనే చర్చ కూడా మరోవైపు మొదలైంది. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్ళు ఎలాగో మనదేశం వీడి వారి స్వదేశాలకు వెళ్ళే పరిస్థితి లేదు. ప్రపంచంలోని దాదాపు 48 దేశాల భారత దేశం నుంచి ప్రయాణీకులను అనుమతించడం లేదు. ఆస్ట్రేలియా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ నుంచి ఎవరైనా ఆస్ట్రేలియాకు వస్తే… ఏకంగా 5 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా (SOUTH AFRICA) , బంగ్లాదేశ్ (BANGLADESH), ఇంగ్లాండ్ (ENGLAND), వెస్టిండీస్, న్యూజీలాండ్ (NEW ZEALAND) దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీని వాయిదా వేసినా.. వారంతా కనీసం నెలరోజులకు పైగా ఇండియాలోనే వుండాల్సి వస్తుంది. ఎలాగో ప్రేక్షకులు లేకుండా.. ఆటగాళ్ళంతా బయో బబుల్‌లో వుంటూ టోర్నీ నిర్వహిస్తున్నారు కనుక మరింత జాగ్రత్తగా టోర్నీకి ఫినిష్ చేయడమే బెటరని కొందరు క్రికెట్ అభిమానులు అంటున్నారు. దేశం యావత్తు దాదాపు రాత్రి కర్ఫ్యూ (NIGHT CURFEW)లో వున్న పరిస్థితిలో ఉన్న ఒక్క ఐపీఎల్ వినోదాన్ని వదులుకోకూడదని మరికొందరు వాదిస్తున్నారు. ఈక్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (IPL SEASON)ను వాయిదా వేయడమో.. రద్దు చేయడమో జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: బెంగాల్ ఎన్నికల విశ్లేషణలో ఆసక్తికర అంశాలెన్నో… తృణమూల్ విజయం వెనుక మర్మమిదే?
ALSO READ: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు




