IPL 2021: చెన్నై జట్టు శిబిరంలో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ..
IPL 2021: ఐపీఎల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఐపిఎల్ 2021 లో, కరోనా వైరస్ యొక్క పరిధి పెరుగుతోంది. ఇప్పటికే కేకేఆర్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకగా..
Chennai Super Kings: ఐపీఎల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేకేఆర్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శిబిరంలో కరోనా కేసులు బయటపడ్డాయి. చెన్నై జట్టులో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్సు క్లీనర్ కు కరోనా పాజిటివ్ తేలినట్లు వెల్లడైంది. జట్టులోని మిగతా వారందరికీ టెస్టులు చేయగా.. నెగటివ్ వచ్చినట్లు చెన్నై యాజమాన్యం స్పష్టం చేసింది.
అటు వీరితో పాటు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఐదుగురు గ్రౌండ్‌మెన్ కు కూడా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో ఐపీఎల్ 2021లో ఒకే రోజు 10 కరోనా కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బృందం ఢిల్లీలో ఉంది. కరోనా పాజిటివ్ వచ్చినవారు 10 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటారు. ఆ తర్వాత వారికి టెస్టులు నిర్వహించి రెండు సార్లు నెగటివ్ వచ్చాక మళ్లీ జట్టులో చేరతారు. కాగా, ఐపీఎల్ బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్నా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
NEET PG Exams: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!
Abhishek Banerjee: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు