Bengal Politics: బెంగాల్ ఎన్నికల విశ్లేషణలో ఆసక్తికర అంశాలెన్నో… తృణమూల్ విజయం వెనుక మర్మమిదే?

దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో దీదీ పార్టీదే పైచేయి అయింది. బొటాబోటీగా విజయం సాధించే అవకాశముంన్న ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను తోసిపుచ్చుతూ... తృణమూల్ కాంగ్రెస్ రెండు వందలకు పైగా సీట్లు...

Bengal Politics: బెంగాల్ ఎన్నికల విశ్లేషణలో ఆసక్తికర అంశాలెన్నో... తృణమూల్ విజయం వెనుక మర్మమిదే?
West Bengal
Follow us

|

Updated on: May 03, 2021 | 3:57 PM

Bengal Politics interesting facts: దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించిన బెంగాల్ అసెంబ్లీ (BENGAL ASSEMBLY) ఎన్నికల పర్వంలో దీదీ పార్టీదే పైచేయి అయింది. బొటాబోటీగా విజయం సాధించే అవకాశముంన్న ఎగ్జిట్ పోల్స్‌ (EXIT POLLS) ఫలితాలను తోసిపుచ్చుతూ… తృణమూల్ కాంగ్రెస్ (TRINAMOOL CONGRESS) రెండు వందలకు పైగా సీట్లు గెలిచి సగర్వంగా మూడోసారి బెంగాల్ (BENGAL) సీటును దక్కించుకోబోతోంది. అయితే.. సీఎం క్యాండిడేట్ (CM CANDIDATE) అయిన మమతా బెనర్జీ (MAMATA BANERJEE) ఓటమి పాలవడమే ఆ పార్టీకి కొద్దిగా షాకిచ్చే అంశం. ఈ క్రమంలో బెంగాల్‌లో దీదీ విజయానికి దారి తీసిన అంశాలేవి అని తరచి చూస్తే.. పలు కీలకాంశాలు కనిపిస్తున్నాయి. క్లియర్‌గా కనిపిస్తున్న అంశం ఏంటంటే.. బెంగాలీలు ఎవరిని ఎంచుకున్నా… రెండు, మూడు తడవలు వారిని వదలరన్న విషయంలో మరోసారి తాజా ఫలితాల ద్వారా తేలింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో (BENGAL ASSEMBLY ELECTIONS) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయనే చెప్పాలి. మూడు దశాబ్దాలపాటు పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ (LEFT FRONT) ఇవాళ తమ ఉనికిని పూర్తిగా కోల్పోయింది. నిజానికి బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ (BJP)ది ఓటమి అని చెప్పలేం. ఎందుకంటే 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బెంగాల్‌లో మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ ఏకంగా 74 సీట్లకు ఎదిగింది. ఒకప్పుడు బెంగాల్‌ను పూర్తిగా ఎరుపు మయం చేసిన వామపక్ష కూటమి (LEFT FRONT) నిర్దిష్టమైన వ్యూహాలు లేక పూర్తిగా చతికిలా పడ్డాయి. ముఖ్యంగా సీపీఎం (CPIM) పార్టీ తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయింది. బీజేపీ ఎంట్రీని ఆ పార్టీ వ్యతిరేకులు పూర్తిగా నిరోధించాలని నిర్ణయించుకుని.. బీజేపీ ఓట్లన్ని పోలరైజ్ కావడంతో దీదీకి ఘన విజయం లభించిందని చెప్పాలి. పశ్చిమ బెంగాల్ (WEST BENGAL) ఒకప్పుడు వామపక్షాల కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా రాజ్యమేలిన ఎర్ర పార్టీలు ఎటు మాయమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే.. వామపక్షాల ఓటమి స్వయంకృతాపరాధమేనని చెప్పుకోవాలి. అటు కేరళ (KERALA)లో కాంగ్రెస్ (CONGRESS PARTY) సారథ్యంలోని యుడీఎఫ్‌ (UDF)తో యుద్ధం చేస్తూనే.. ఇటు బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీతో కలిసి అస్తిత్వం కాపాడుకునేందుకు ఎర్ర సోదరులు ప్రయత్నించడమే ఎదురు దెబ్బకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని కూడా బెంగాల్‌లో ఒక్క సీటు కూడా గెలవలేని దుస్థితికి వామపక్షాలు దిగజారాయి.

1977 నుంచి 2011 దాకా.. 34 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేడు దయనీయ స్థితికి దిగజారింది. ప్రజా ఉద్యమాలు, భూ సంస్కరణలతో ఒకప్పుడు బెంగాలీల మనసు గెలుచుకొని సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకు.. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు రకరకాల కారణాలు చెబుతున్నారు. 2007లో నందిగ్రామ్‌ (NANDIGRAM)లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమాలలో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలతో 2011ఎన్నికల్లో వామపక్షాలు అధికారాన్ని కోల్పోయాయి. ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) అధికారంలోకి వచ్చింది. అనంతరం, 2016లోనూ మళ్లీ రెండోసారి దీదీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ దశాబ్దకాలంలో కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు (POLITICAL ANALYSTS) చెబుతున్నారు. సంస్థాగతంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడంలో లెఫ్ట్‌ పార్టీల నాయకత్వం విఫలమవ్వడం, మిత్రపక్షం బంధానికి ప్రాధాన్యతనిస్తూ గట్టి పట్టున్న స్థానాలను సీట్ల సర్దుబాటులో వదులుకోవడంతో ఓటమి చెందినట్లు ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

రాహుల్‌ గాంధీ (RAHUL GANDHI), ప్రియాంక (PRIYANKA) వంటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు (CONGRESS SENIOR LEADERS) బెంగాల్‌ ఎన్నికలకు అంతగా ప్రాధాన్యతనివ్వకపోవడం.. కేరళపైనే వారిద్దరు ఎక్కువగా ఫోకస్ చేయడం కూడా ప్రతికూల ఫలితాలకు కారణమైందని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇటు బెంగాల్ వస్తే కమ్యూనిస్టులకు అనుకూలంగా మాట్లాడడం.. అటు కేరళ వెళితే.. వామపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం.. కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని బెంగాలీయులు అర్థం చేసుకున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేరళలో కత్తులు దూసుకుంటున్న లెఫ్ట్‌-కాంగ్రెస్‌.. బెంగాల్‌లో జట్టు కట్టడం ప్రజలకు ఆ కూటమిపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసిందని, అందుకే కాంగ్రెస్‌ ఓట్లు బీజేపీకి ఎక్కువగా పోలైనట్టు అంచనా వేస్తున్నారు. 2006లో బెంగాల్‌లో కమ్యూనిస్టులకు 50 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉండేది. 2011 నాటికి ఇది 40 శాతానికి, 2016కి 26 శాతానికి పడిపోయింది. 2016 శానసనభ ఎన్నికల్లో సీపీఐ ఒక్కటి, సీపీఎం 26 స్థానాలకే పరిమితమయ్యాయి. తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం భారీగా తగ్గింది. దాంతో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు ఖాతా కూడా తెరవలేకపోయాయి.

ఇక్కడ మరో అంశం కూడా చెప్పుకోవాల్సి వుంటుంది. బెంగాల్‌లో ముస్లింల ఓట్లు (MUSLIM VOTES) గణనీయంగా వున్నాయి. ఈ ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్-కాంగ్రెస్ కూటముల మధ్య చీలుతాయని అందరు భావించారు. దానికి ముస్లింలీగ్ (MUSLIM LEAGUE) ఫ్రంట్ కూడా జత కల్వడం.. మరోవైపు హైదరాబాదీ (HYDERABAD) పార్టీ ఎంఐఎం (MIM) కూడా రంగంలోకి దిగడం వంటి అంశాలు ముస్లింల ఓట్లు చీలడానికి దారి తీస్తాయని కొందరు అంఛనా వేశారు. కానీ బెంగాల్‌లోకి బీజేపీ (BJP) ఎంట్రీని గట్టిగా వ్యతిరేకిస్తున్న ముస్లింలు.. ఒక్కతాటిపై నిలిచి బీజేపీకి ధీటైన ప్రత్యర్థిగా టీఎంసీ (TMC)ని భావించారు. దాంతో ముస్లింల ఓట్లు పోలరైజ్ అయ్యి.. మమతాబెనర్జీకి అనుకూలంగా మారింది. నిజానికి దీదీ పార్టీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్ (CONGRESS-LEFT FRONT) కూటమి నేతలు ప్రచారం మధ్యలోనే చేతులెత్తయడమేనని.. దాంతో ఆ కూటమికి చెందిన సీట్లన్ని టీఎంసీ ఖాతాలోకి చేరాయని అంఛనా వేస్తున్నారు.

పలు సానుకూల అంశాల కారణంగా పశ్చిమ బెంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ మరోసారి అధికారం దక్కించుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే.. సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి (SUVENDU ADHIKARI) చేతిలో ఓటమి పాలయ్యారు. అఫ్‌కోర్స్ ఆమె దొడ్డిదారిలో ముఖ్యమంత్రి (CHIEF MINISTER) అయ్యే అవకాశం వుంది. ముందుగా సీఎం (CM)గా బాధ్యతలు చేపట్టడం… ఆరు నెలల కాలంలో అయితే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం దీదీకి వుంది. తాను ఓటమి పాలైన తన శక్తియుక్తులతో బీజేపీ ఎంట్రీని నిలువరించగలగడమే ఇపుడు మమతా బెనర్జీ సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పుకోవాల్సి వుంది.

ALSO READ: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే