బెంగాల్ లో వెల్లువెత్తిన హింస, గవర్నర్ కు ప్రధాని మోదీ ఫోన్, తాజా పరిస్థితులపై ఆరా
ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ లో వెల్లువెత్తిన హింసపై ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ తో ఫోన్ లో మాట్లాడారు. రాష్టంలో శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు...
ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ లో వెల్లువెత్తిన హింసపై ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ తో ఫోన్ లో మాట్లాడారు. రాష్టంలో శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్ కూడా…. లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై తాను ఆయనకువివరించానని ట్వీట్ చేశారు. సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి మరో ట్వీట్ చేస్తూ.. రాష్ట్రంలో అల్లర్లు, హింస, హత్యలు, దాడులపై మీరు వెలిబుచ్చిన ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నానని, సాధారణ పరిస్థితులు సాధ్యమైనంత త్వరలో ఏర్పడగలవని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కాగా బెంగాల్ లో జరిగిన హింస, అల్లర్లలో కనీసం 12 మంది మరణించారు. తమ పార్టీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని, వారి ఇళ్ళ లోకి చొరబడి దౌర్జన్యాలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరాం గఢ్ వంటి పలు చోట్ల తమ పార్టీ కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారని వారు తెలిపారు. 6 జిల్లాల్లో 8 మంది తమ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులు కూడా హతులయ్యారని అన్నారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమిని జీర్ణించుకోలేక ఇలా హింసకు దిగారన్నారు.
మరోవైపు సీఎం మమతా బెనర్జీ ..బెంగాల్ శాంతి కాముక రాష్ట్రమని, ఈ ఎన్నికల్లో అక్కడక్కడఘ్జర్షణలు జరిగాయని అన్నారు. తమ పార్టీ వర్గీయులను బీజేపీ ఎంతో వేధించిందని, కానీ శాంతియుతంగా ఉండాలని తమ పార్టీ వారిని కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు, ఏదైనా వివాదం ఉంటె పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. [పోలీసులు లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తారని ఆమె తెలిపారు. కాగా రాష్ట్రంలో 4 వేల ఇళ్లపై తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు దాడులు చేశారని, మహిళలపై అత్యాచారాలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. అటు-ఈ హింసపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ ఈ పార్టీ నాయకుడొకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రెండు రోజుల పర్యటనకు గాను బెంగాల్ ను సందర్శించనున్నారు. హతులైన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోమ్ శాఖ నివేదిక కోరింది. అటు సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ఈ హింసను ఖండిస్తూ ట్వీట్ చేశారు. సీపీఎం కార్యకర్తలపై కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
ఇలా ఉండగా తూర్పు బర్ధన్ జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలైన ముగ్గురిని బీజేపీ కార్యకర్తలు కొట్టి చంపారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.
సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.