AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill gates: విడాకులు తీసుకోనున్న బిల్‌గేట్స్‌ దంపతులు.. తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతున్నట్టు సంచలన ట్వీట్!

తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సంచలన ట్వీట్ చేశారు. ఆయన తన భార్య మేలిందాతో విడిపోనున్నట్టు తెలిపారు.

Bill gates: విడాకులు తీసుకోనున్న బిల్‌గేట్స్‌ దంపతులు.. తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతున్నట్టు సంచలన ట్వీట్!
Bill Gates and Melinda Gates Divorce
KVD Varma
|

Updated on: May 04, 2021 | 6:50 AM

Share

Bill gates: తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ సంచలన ట్వీట్ చేశారు. ఆయన తన భార్య మేలిందాతో విడిపోనున్నట్టు తెలిపారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా అనేక ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన ఈ జంట విద్పోతుండానే విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. ‘‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’’ అని ట్విటర్‌లో బిల్‌, మెలిందాలు ప్రకటించారు.

మెలిందా 1987 లో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందా ఆతరువాత బిల్ గేట్స్ తో పరిచయం..వారి వివాహం జరిగాయి. వీరి వివాహం 1994 లో హవాయిలో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు. 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు.

Bill Gates Tweet

Bill Gates Tweet

Also Read: Adar Poonawala: బెదిరింపులా..? బిజినెస్ విస్తరణ వ్యూహమా? అదర్ పూనావాలా లండన్ మకాం వెనుక మర్మమిదే!

Saudi Arabia: సౌదీ అరేబియాలో ఈజిప్టు పిరమిడ్ల కంటె పురాతనమైన కట్టడాలు..ఇవి ఏడువేల సంవత్సరాల కంటె ముందు నిర్మించినవట!