Adar Poonawala: బెదిరింపులా..? బిజినెస్ విస్తరణ వ్యూహమా? అదర్ పూనావాలా లండన్ మకాం వెనుక మర్మమిదే!

అదర్ పూనావాలా... గత ఏడాది కాలంగా దేశంలో మారుమోగుతున్న పేరు. కరోనా మహమ్మారికి దేశంలో తొలి విరుగుడును కనిపెట్టి.. కోవిషీల్డు పేరిట వ్యాక్సిన్‌ను ప్రకటించిన నాటి నుంచి సీరం ఇన్‌స్ట్యూట్ అధినేత అదర్ పూనావాలా న్యూస్‌లో...

Adar Poonawala: బెదిరింపులా..? బిజినెస్ విస్తరణ వ్యూహమా? అదర్ పూనావాలా లండన్ మకాం వెనుక మర్మమిదే!
Adar Poonawala Image And Covieshield Vaccine
Follow us
Rajesh Sharma

|

Updated on: May 02, 2021 | 2:30 PM

Adar Poonawala strategy behind London stay: అదర్ పూనావాలా… గత ఏడాది కాలంగా దేశంలో మారుమోగుతున్న పేరు. కరోనా మహమ్మారి (CORONA VIRUS)కి దేశంలో తొలి విరుగుడును కనిపెట్టి.. కోవిషీల్డు (COVIE SHIELD) పేరిట వ్యాక్సిన్‌ (VACCINE)ను ప్రకటించిన నాటి నుంచి సీరం ఇన్‌స్ట్యూట్ (SIRUM INSTITUTE) అధినేత అదర్ పూనావాలా న్యూస్‌లో నానున్నారు. వ్యాక్సిన్ అందించినప్పుడు హీరోలా చూసిన వాళ్ళంతా ఇపుడు పూనావాలా కదలికలను అనుమానించాల్సిన పరిస్థితి తాజాగా మొదలైంది. మనదేశంలో కరోనా వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో పూనావాలా ఉన్నట్లుండి లండన్‌ (LONDON)కు వెళ్ళిపోయి అక్కడే వుండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో ఆయన ది టైమ్స్ (THE TIMES) పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. దాంతో అసలేం జరుగుతోందన్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది.

మన దేశంలో కరోనా ఫస్ట్ వేవ్‌ (CORONA FIRST WAVE)ని సక్సెస్‌ఫుల్‌గా నియంత్రించినప్పటికీ సెకెండ్ వేవ్ (SECOND WAVE) కరోనా మాత్రం దేశాన్ని వణికిస్తోంది. రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) నమోదు అవుతున్నాయి. భారత్‌ (BHARAT)లో కరోనా వేవ్ పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దేశాలు ముందుకొచ్చి ఆపన్న హస్తమందిస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను సరఫరా చేసేందుకు మొదటి తిరస్కరించిన అగ్రరాజ్యం అమెరికా (AMERICA) 48 గంటల్లో మనసు మార్చుకుని భారత్‌కు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది. ముడి పదార్థాలతో బయలు దేరిన అమెరికా విమానం భారత్‌కు కూడా చేరుకుంది. మరోవైపు రష్యా (RUSSIA) రూపొందించిన స్పుత్నిక్ వీ (SPUTNIK V) వ్యాక్సిన్లు కూడా హైదరాబాద్ (HYDERABAD) చేరుకున్నాయి.

ఇదంతా ఇలా కొనసాగుతున్న తరుణంలో అదర్ పూనావాలా లండన్‌కు వెళ్ళిపోయిన విషయం చర్చనీయాంశమైంది. తన బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా అంతర్జాతీయ మార్కెట్‌లో కోవీ షీల్డును మార్కెటింగ్ చేసుకునేందుకు వెళ్ళినట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుంటే అదర్ పూనావాలా మాత్రం ది టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తనకు తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, దేశంలోని కొందరు అత్యంత బలవంతులైన ప్రముఖులు కోవిషీల్డ్‌ సరఫరా కోసం డిమాండ్‌ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని పూనావాలా ఇంటర్య్వూలో వెల్లడించారు. అందుకే భార్యా పిల్లలతో కలిసి ఉండటానికి లండన్‌కు వచ్చేశానని, దీనికి ఒత్తిళ్లే ముఖ్యకారణమని ఆయన చెప్పారు.

అయితే.. పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత (Y CATEGORY SECURITY) కల్పించింది. అంతటి భద్రత వున్న వ్యక్తి ఉన్నట్లుండి లండన్ వెళ్ళిపోవడం, తనకు ఒత్తిళ్ళున్నాయంటూ ఆరోపణలు చేయడం కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) పూనావాలా వ్యవహారంలో స్పందించడం లేదు. ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ కాలం యుకే (UK)లో వుండిపోవడానికి కారణం మనదేశంలో తనకు రక్షణ లేదని భావించడమేనని పూనావాలా చెబుతున్నారు. కానీ భారత్‌లో వ్యాక్సిన్ ధర విషయంలో ఎదుర్కొన్న విమర్శలు కూడా అదర్ పూనావాలా లండన్ పయనమవడానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వానికి 300 రూపాయలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న సీరం సంస్థ.. ప్రైవేటు రంగానికి మాత్రం 600 రూపాయల ధరను నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలో పలు రాజకీయ పార్టీలు సీరం సంస్థను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగాయి. దేశంలో ఇప్పటి వరకు ఉత్పత్తి అవుతున్న రెండు వ్యాక్సిన్లలో కోవిషీల్డు అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ప్రతీ రోజు 6 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను సీరం సంస్థ కోవిషీల్డును తయారు చేస్తుంటే.. భారత్ బయోటెక్ (BHARAT BIOTECH) తయారు చేస్తున్న కోవాక్సిన్ (COVAXINE) కేవలం కోటి మాత్రమే ఉత్పత్తి అవుతోంది.

ఈ స్థాయిలో కోవిషీల్డు ఉత్పత్తి అవుతున్న పరిస్థితిలో తమకంటే తమకు సరఫరా చేయాలని పలువురు ఒత్తిళ్ళకు పాల్పడడం వల్లనే తాను యుకే వెళ్ళినట్లు పూనావాలా చెబుతున్నారు. అంతే కాదు.. ఇప్పుడప్పుడే ఇండియాకు రావాలని అనుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. చేయగలిగినంత చేస్తుండగా ఎవరో బెదిరింపులకు పాల్పడితే భయపడుతూ గడపలేం కదా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు పూనావాలా. అంటే తనకు ఇండియాలో రక్షణ లేదని ఆయన పరోక్షంగా చెప్పారు. మరి కేవలం బెదిరింపులకు భయపడే పూనావాలా యుకే వెళ్ళిపోయాడా? అంటే బిజినెస్ ఆలోచనలు కూడా వున్నట్లు క్లియర్‌గా వెల్లడవుతున్నాయి. ఇండియాలో కోవిషీల్డు ఉత్పత్తి చేసి.. విక్రయించినా పెద్దగా వ్యాపార లాభాలు రాకపోవడం.. లేదా మరింతగా బిజినెస్ పెంచుకునే అవకాశాలు కూడా లేవని భావించడం వల్లనే పూనావాలా యుకే వెళ్ళి వుంటాడని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. యుకే కేంద్రంగా కోవిషీల్డు ఉత్పత్తి చేస్తే.. ప్రపంచ మార్కెట్‌లో పెద్ద ఎత్తున సప్లై చేసి.. వేల కోట్లు ఆర్జించవచ్చన్న బిజినెస్ ఆలోచనతోనే పూనావాలా లండన్‌లో మకాం వేసినట్లు తెలుస్తోంది.

భారత్‌కు బయట కూడా కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయని, లండన్‌లో మకాం పెట్టడానికి ఇది కూడా ఒక కారణమని పూనావాలా సంకేతాలిచ్చారు. బ్రిటన్‌తో సహా ఇతరదేశాల్లో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి సంబంధించిన రాబోయే కొద్దిరోజుల్లో ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. భారత్‌లో పరిస్థితి ఇంతగా విషమిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారన్నారు. కోవిషీల్డ్‌ డోసు ధరను రాష్ట్రాలకు రూ.300, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లుగా నిర్ణయించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లోనూ లాభాలు మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై పూనావాలా స్పందిస్తూ… ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న వ్యాక్సిన్‌ తమదేనని అన్నారు. తామేమీ తప్పు చేయడం లేదని, దీనిపై కాలం చెప్పే తీర్పు కోసం వేచిచూస్తానని అన్నారు.

ALSO READ: అఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ షురూ.. సెప్టెంబర్ 11 డెడ్‌లైన్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?