Coronavirus Myths: ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా పోతుందా.? కర్పూరంతో ఆక్సిజన్.? వీటిలో నిజమెంతా.?
Coronavirus Myths: ఓవైపు కరోనా మహమ్మారి భయ బ్రాంతులకు గురి చేస్తుంటే ఈ వైరస్ గురించి చక్కర్లు కొడుతోన్న వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. వైద్యులు సూచించిన...
Coronavirus Myths: ఓవైపు కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తుంటే ఈ వైరస్ గురించి చక్కర్లు కొడుతోన్న వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. వైద్యులు సూచించిన ఔషధాలతో పాటు మంచి ఆహారం తీసుకుంటే చాలా మంది కరోనాను సులభంగా జయిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చిట్కాలను పాటిస్తే కరోనా దరి చేరదని, ఒకవేళ వచ్చినా పరార్ అవుతుందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ చిట్కాలకు ఎంత వరకు శాస్త్రీయత ఉందన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముక్కులో నిమ్మరసం వేసుకుంటే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది..
కరోనా కారణంగా చాలా మంది శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవడానికి ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ చిట్కాను ఉపయోగించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. ఇక దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. నిమ్మ రసంతో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి శాస్త్రీయత లేదని చెబుతున్నారు. అనవసరంగా ఇలాంటి వాటిని ఉపయోగించి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని సూచిస్తున్నారు.
ఆక్సిజన్ సిలిండర్ లేకున్నా నెబులైజర్ ఉంటే చాలు..
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మరో చిట్కా.. నెబులైజర్‌తో కరోనా రోగికి ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చు. ఇందులో ఎంత మాత్రం వాస్తవికత లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ప్రమాణాలు, శాస్త్రీయ అధ్యయనాలు లేవని నిపుణులు తేల్చి చెబుతున్నారు. రోగికి అదనపు ఆక్సిజన్ అందించడానికి ఈ విధానం ఎంతమాత్రం ఉపయోగపడదని, అనవసరంగా ప్రాణాలు మీదకు తెచ్చుకోకూడదని సూచిస్తున్నారు.
కర్పూరంతో ఆక్సిజన్..
కర్పూరం, వాము, నీలగిరి తైలంతో తయారు చేసిన మిశ్రమాన్ని తీసుకుంటే కరోనా బాధితుల్లో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అయితే ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కర్పూరాన్ని శరీరం లోపలికి తీసుకోవడం ప్రాణాల మీదకు కూడా తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చూశారుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కదా అని మీరు కూడా ఇలాంటి ప్రమాదకర చిట్కాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకండి. ఏ విషయాన్ని అయినా వైద్యుల ద్వారానే నిర్ధారించుకోవడం ఉత్తమమం. అంతే కాకుండా ఇలాంటి వార్తలను వీలైనంత వరకు షేర్ చేయకుండా ఉండడమే ఉత్తమం.
Also Read: PF ఖాతాదారులకు అలర్ట్.. ఉద్యోగం మారారా ? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే…
నందిగ్రామ్ నియోజకవర్గం మమతా బెనర్జీ నుంచి చేజారనుందా ? బెంగాల్ ఎన్నికల్లో విచిత్రం !
CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలు విడుదల.. జూన్ 20న ఫలితాలు