నందిగ్రామ్ నియోజకవర్గం మమతా బెనర్జీ నుంచి చేజారనుందా ? బెంగాల్ ఎన్నికల్లో విచిత్రం !

బెంగాల్ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం 11  గంటల సమయానికి సీఎం మమతా బెనర్జీ  నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 179 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 105 స్థానాల్లో...

నందిగ్రామ్ నియోజకవర్గం మమతా బెనర్జీ నుంచి చేజారనుందా ? బెంగాల్ ఎన్నికల్లో విచిత్రం !
TMC vs BJP
Follow us
Umakanth Rao

| Edited By: Ram Naramaneni

Updated on: May 02, 2021 | 10:13 PM

బెంగాల్ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం 11  గంటల సమయానికి సీఎం మమతా బెనర్జీ  నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 179 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 105 స్థానాల్లో  లీడింగ్ లో ఉంది. అత్యంత  ముఖ్యమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో దీదీ వెనుకబడి ఉన్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి సువెందు  అధికారి కన్నా 8 ఆమె వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. ఈ వెనుకంజ ఆమెకు అంతుబట్ట లేదు. తాజా ట్రెండ్ గమనించిన ఆమె కోల్ కతా లోఆదివారం వర్చ్యువల్ గా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అప్పుడే భారీ  స్క్రీన్ ఏర్పాటు చేశారు.

నందిగ్రామ్ లో తాను మమతా బెనర్జీపై 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తానని, లేని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలగుతానని సువెందు  అధికారి లోగడ సవాల్ చేశారు. ఇప్పుడు ఆ సవాల్ వాస్తవ రూపం దాలుస్తుందా అని విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ ఎన్నికల్లో నందిగ్రామ్   తనదేనని, ఇది తన పుట్టిల్లు అని మమత ఎన్నికల ప్రచారం సందర్భంగా పేర్కొన్నారు. బయటివారు (బీజేపీ నేతలు) ఇక్కడ గెలిచే అవకాశాలు లేవని కూడా అన్నారు. అయితే చూడబోతే ఈ నియోజకవర్గ ప్రజలు ఆమె మాటలను విశ్వసించనట్టు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తన కారు ఎక్కబోతూ ఆమె గాయపడిన సంగతి తెలిసిందే.  తనపై దాడి జరిగిందని, తన కాలుకు దెబ్బలు తగిలాయని ఆమె ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స కూడా పొందారు. అయితే ఎన్నికల్లో ప్రజల సానుభూతి పోందిందేందుకే ఆమె ఈ నాటకం ఆడారని బీజేపీ  .ఆరోపించింది. కాగా ఈ ఎన్నికల్లో ఈమె పార్టీకి చెందిన , అభ్యర్థులు  పలువురు మంత్రులు, అభ్యర్థులు  గెలిచారు.ఇది మమతకు సంతోషం కలిగించేదే అయినా నందిగ్రామ్ ట్రెండ్ ఆమెను కలవరపరుస్తోంది. ఇది ముఖ్యంగా బీజేపీకి ఊరట కలిగించే విషయం. తాము ఓడిపోయినా మమత  గెలవరాదన్నది ఈ పార్టీ నేతల మనోగతం.

ఇక తమిళనాడులో అందరూ ఊహించినట్టు   స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే విజయం దిశగా పయనిస్తోంది. ఈ పార్టీ 133 చోట్ల లీడింగ్ లో ఉండగా…. అన్నా డీఎంకే 100 సీట్లలో లీడింగ్ లో ఉంది.   కేరళలో  ఆ రాష్ట్రాన్ని  ఓ ఊపు ఊపిన గోల్డ్ స్కామ్ … సీఎం పినరయి విజయన్  నేతృత్వంలోని ఎల్ డీ ఎఫ్ ప్రభుత్వాన్ని  ఏమీ చేయలేకపోయింది. రాష్ట్రంలో ఇది 91 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్.. 47 చోట్ల ఆధిక్యంలో ఉంది.   పాలక్కాడ్ నియోజకవర్గంలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఆధిక్యలో ఉన్నారు.  అస్సాంలో బీజేపీ 41 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ త్వరలో వైదొలగనున్న సీఎం సర్బానంద సోనోవాల్ లీడింగ్ లో ఉన్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ఒక చోట ఆధిక్యంలో ఉంది.