తెలంగాణ లో టీఆర్ఎస్ కు తిరుగులేదు.. రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదు -మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్ వెన్నంటి నిలిచారని చెప్పారు. ఎమ్మేల్యేగా నోముల భగత్ కు పట్టం కట్టారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఇంద్రకరణ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు కృతజ్ఞతలు, కేటీఆర్ కు, ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విజయాన్ని అందించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ఈ విజయంతో మరోసారి స్పష్టమైందని తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి చోటు లేదని, టీఆర్ఎస్ కు బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేసారు. రెండు జాతీయ పార్టీలకూ నాగార్జున సాగర్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. గత ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ఉనికే లేదన్నారు.
టీఆర్‌ఎస్ వెంటే తెలంగాణ ప్రజలు -మంత్రి నిరంజన్‌రెడ్డి
ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్ వెంట, టీఆర్ఎస్ వెంటే ఉందని స్పష్టమయిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల సరళిని విశ్లేషిస్తే కాంగ్రెస్, బీజేపీలు టీఅర్ఎస్ కు అసలు పోటీ కాదు, కాలేదని తేటతెల్లం అయిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆరే తమ నాయకుడు అని, వారి నాయకత్వం మీదనే తమ నమ్మకం అని నిరూపించారు. సాగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పక్షాన నిలిచిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Read More:
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘనవిజయం.. 18,449 ఓట్లతో నోముల భగత్ గెలుపు