AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జానారెడ్డికి మరోసారి సాగర్‌లో షాక్‌.. ఓట్ల లెక్కింపులో జానారెడ్డి ఆధిక్యంలోకి వచ్చిన రౌండ్లు ఏంటో తెలుసా..?

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో వరుస రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కేవలం..

జానారెడ్డికి మరోసారి సాగర్‌లో షాక్‌.. ఓట్ల లెక్కింపులో జానారెడ్డి ఆధిక్యంలోకి వచ్చిన రౌండ్లు ఏంటో తెలుసా..?
Janareddy
K Sammaiah
|

Updated on: May 02, 2021 | 3:22 PM

Share

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో వరుస రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కేవలం ఒక్క 10, 11, 14వ రౌండ్‌లో ఆధిక్యం కనబరిచారు. జానాకు కంచుకోటగా ఉన్న సాగర్‌లో టీఆర్‌ఎస్‌ మరోసారి సత్తాచాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తరపున ఇక్కడి నుంచి పోటీచేసిన జానారెడ్డి దివంగత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిదే. ఇక ప్రస్తుతం నోముల వారసుడు భగత్‌ చేతిలో మారోసారి ఓటమి చెందారు.

ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన కాంగ్రెస్‌ పార్టీ ఫలితాల్లో చతికిలపడింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 18,449 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. నోముల భగత్‌ను వ్యూహాత్మంగా సాగర్‌ బరిలో దించిన టీఆర్‌ఎస్‌.. ఓటర్ల దృష్టిని తమవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయింది. తండ్రి నోముల నర్సింహయ్యపై ఉన్న అభిమానాన్ని ప్రజలు భగత్‌పైనా చూపించారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీచ్చిన బీజేపీ ప్రయత్నం సాగర్‌లో సాగలేదు. క్షేత్రస్థాయిలో అధికార టీఆర్‌ఎస్‌ బలం ముందు కాషాయదళం తేలిపోయింది.

మొత్తం లెక్కింపులో ఒక్క రౌండ్‌లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేదు. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన అధికార టీఆర్‌ఎస్‌ సాగర్‌ ఉప ఎన్నికలో వ్యూహాత్మంగా వ్యవహరించింది. చివరివరకు అభ్యర్థిని ప్రకటించడకుండా ఆఖరి క్షణంలో నరసింహయ్య కొడుకునే బరిలోకి దించింది. తద్వారా ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా జాగ్రత్త పడింది. జానా కోటలో మరోసారి పాగా వేసింది.

Read More:

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం.. 18,449 ఓట్లతో నోముల భగత్‌ గెలుపు