America Military: అఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ షురూ.. సెప్టెంబర్ 11 డెడ్‌లైన్

దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన అమెరికా ఎట్టకేలకు ఆ దేశం నుంచి సైన్యం ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. మే 1వ తేదీ సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనల...

America Military: అఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ షురూ.. సెప్టెంబర్ 11 డెడ్‌లైన్
Afghanistan
Follow us

|

Updated on: May 02, 2021 | 2:29 PM

America Military withdrawal starts from Afghanistan: దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ (AFGHANISTAN) వేదికగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన అమెరికా (AMERICA) ఎట్టకేలకు ఆ దేశం నుంచి సైన్యం ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. మే 1వ తేదీ సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనల (NATO MILITARY FORCES) చివరిదశ ఉపసంహరణ పర్వం మొదలైంది. ఈ ఉపసంహరణ పర్వం వేసవి కాలం ముగిసే సమయానికి పూర్తి కావచ్చని భావిస్తున్నారు. అమెరికా దళాలు (AMERICAN MILITARY FORCES) సెప్టెంబర్ 11వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో బయటకు వస్తాయని ఇదివరకే ప్రకటించంది. ప్రస్తుతం ఉపసంహరణ ప్రారంభం కాగా ఇందులో అమెరికాకు చెందిన సైనికులు దాదాపు 3500 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. నాటో దళాలకు చెందిన మరో ఏడు వేల మంది సైనికుల ఉపసంహరణ కూడా శనివారమే ప్రారంభమయ్యింది. అమెరికా అధ్యక్షుని (AMERICAN PRESIDENT)గా జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ (JOE BIDEN) ప్రకటించినట్టుగానే నాటో దళాల ఉపసంహరణ మొదలయ్యింది. అయితే ఏప్రిల్ 30వ తేదీన చివరి దశ ఉపసంహరణకు ఒకరోజు ముందే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక సామాగ్రిని తరలించడాన్ని మొదలుపెట్టింది అగ్రరాజ్యం అమెరికా. ఇందుకోసం సీ17 లాంటి భారీ సైనిక కార్గో విమానాలను (MILITARY CARGO FLIGHTS) అమెరికా రంగంలోకి దింపింది.

2001 సెప్టెంబరు 11 వ తేదీన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ (NEW YORK) ట్విన్ టవర్స్‌ (TWIN TOWERS)పైన జరిగిన దాడిలో భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అప్పట్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఖయిదా (AL-QAIDA) ప్రకటించుకుంది. దానికితోడు అమెరికా మీద మరిన్ని ఇటువంటి దాడులు జరుగుతాయని అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ (OSAMA BIN LADEN) అప్పట్లో ప్రకటించారు. దాంతో అగ్రరాజ్యం అమెరికాకు ఈగో దెబ్బతిన్నది. ఫలితంగా 2011 అక్టోబరు 7వ తేదీన అమెరికా, నాటో దేశాల దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను వెతుక్కుంటూ ఆ తర్వాత క్రమంగా తాలిబన్ల (TALIBAN)ను అంతం చేయడం ప్రారంభించాయి. ఆ తర్వాత పాకిస్తాన్ (PAKISTAN) భూభాగంలో దాక్కున్న అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికాకు చెందిన నేవీ దళం సీల్ టీమ్ (SEAL TEAM) హతమార్చింది. సుదీర్ఘంగా అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా రకరకాల దాడులకు పాల్పడ్డాయి. వైమానిక దాడులతో అఫ్గనిస్తాన్ పౌరులను హడలెత్తించాయి. ఎక్కడ నలుగురు యువకులు కలిసి వున్నా వారిని ఉగ్రవాదులగా ముద్ర వేసి నాటో దళాలు హతమార్చాయి.

సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌లపై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని అమెరికా సైన్యం కానీ, నాటో దళాలు కానీ సాధించలేకపోయాయి. చివరికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించింది. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన ప్రచార అంశంగా మారింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (DONALD TRUMP) తాను మళ్లీ గెలిస్తే నుంచి అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరిస్తానని హామీ ఇచ్చారు. అయితే తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత అధ్యక్షుడు మాత్రం ఉపసంహరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాను అధికారపగ్గాలు చేపట్టిన మూడు నెలల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉపసంహరణ మే 1వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీన ముగుస్తుందని  ఆయన స్పష్టం చేశారు.

రెండు దశాబ్దాల్లో హైలెట్స్ ఇవే.. !

# గత 20 సంవత్సరాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం కోసం అమెరికా 148 లక్షల కోట్లు (2 లక్షల డాలర్లు) వ్యయం చేసినట్లు బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడయింది.

# అఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో 47 వేల 245 మంది ఆఫ్ఘనిస్తాన్ సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 69 వేల మంది సైనికులు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు.

# అమెరికా సైనికులు 2,442 మంది చనిపోగా మరో 20 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాంట్రాక్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది 3800 మంది మృతి చెందారు గత 20 సంవత్సరాలలో.

# నాటో దళాలకు చెందిన 1,144 మంది సిబ్బంది కూడా గత రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్ వేదికగా ప్రాణాలు విడిచారు.

# 2001లో తాలిబన్లు అధికారాన్ని కోల్పోయినా సుదీర్ఘకాలంగా అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు నాటో దళాలపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికి 50 శాతం భూభాగం తాలిబన్ల ఆధిపత్యంలోనే ఉందని అంచనా.

ALSO READ: బెదిరింపులా..? బిజినెస్ విస్తరణ వ్యూహమా? అదర్ పూనావాలా లండన్ మకాం వెనుక మర్మమిదే!