అమెరికా నుంచి ఇండియాకు ‘కోవిడ్ సహాయక’ విమానాల రాకలో జాప్యం, ఎందుకంటే ?

అమెరికా నుంచి కోవిడ్ సప్లయ్ లతో కూడిన రెండు విమానాల రాకలో రెండు రోజులు జాప్యం జరుగుతోంది. 2 సీ-5 సూపర్ గెలాక్సీలు, ఒక సీ-గ్లోబ్ మాస్టర్ విమానం మంగళవారం ఇండియాకు చేరాల్సి ఉంది...

  • Umakanth Rao
  • Publish Date - 10:09 am, Tue, 4 May 21
అమెరికా నుంచి ఇండియాకు  'కోవిడ్ సహాయక' విమానాల రాకలో జాప్యం, ఎందుకంటే ?
Us Flights To India With Covid Supplies Delayed

అమెరికా నుంచి కోవిడ్ సప్లయ్ లతో కూడిన రెండు విమానాల రాకలో రెండు రోజులు జాప్యం జరుగుతోంది. 2 సీ-5 సూపర్ గెలాక్సీలు, ఒక సీ-గ్లోబ్ మాస్టర్ విమానం మంగళవారం ఇండియాకు చేరాల్సి ఉంది. అయితే మెయింటెనెన్స్ సమస్యల కారణంగా భారత దేశానికి ఇవి చేరడంలో ఆలస్యమవుతోందని పెంటగాన్ వెల్లడించింది. ఇండియాకు సహాయక సామగ్రిని సరఫరా చేసే రవాణా సంస్థ నుంచి తమకు ఈ మేరకు సమాచారం అందినట్టు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. బుధవారం ఇవి అమెరికా నుంచి బయల్దేరే సూచనలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలతో కూడిన  రెండు విమానాలు ఇండియాకు చేరాయి.  భారత దేశానికి ఎమర్జెన్సీ సప్లయ్ లపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో అధికారులు వివరించలేకపోయారు. అయితే భారత అధికారులతో తాము ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్టు వారు తెలిపారు. హెల్త్ కేర్ సప్లయ్ లతో తాము ఆ దేశానికి విమానాలను పంపుతూనే ఉంటామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిట్ బీ వెల్లడించారు. పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో ఇండియా ఎలా తల్లడిల్లుతోందో తాము గమనిస్తున్నామని ఆయన చెప్పారు. ఇండియా తమ భాగస్వామ్య దేశమని, తక్షణ సాయం చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.

పలువురు అమెరికన్ ఎంపీలు ..భారత దేశానికి తమ బైడెన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఇండియా కోరగానే ఈ ప్రభుత్వం స్పందించిందని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని వారు అన్నారు. కోవిద్ పై పోరాటంలో అన్ని దేశాలూ ముందుకు రావాలని, ఉమ్మడిగా దీని నిర్మూలనకు కృషి చేయాలని వారు అంటున్నారు. ఇండియాలో కోవిద్ ప్రపంచదేశాలకు కూడా ప్రమాదకరమని వారు హెచ్చరించారు. ఇండియన్ వేరియంట్ పై పలువురు పరిశోధకులు చేస్తున్న కృషి ఫలించి ఈ మహమ్మారి అదుపులోకి రాగలదని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.అటు భారత్ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చదుపట్టాలని ఎంపీలు సూచించారు.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.
మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …